సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 13 అక్టోబరు 2017 (18:28 IST)

రోజా ఎక్కడుంటే రూమర్స్ అక్కడుంటాయ్... 'LP'లా చేయమని అడిగితే చూస్తా... రోజా

లక్ష్మీపార్వతి పాత్రను రోజా చేస్తుందంటూ వస్తున్న వార్తలపై సినీ నటి, ఎమ్మెల్యే రోజా స్పందించారు. రోజా ఎక్కడుంటే అక్కడ రూమర్స్ సహజమేననీ, తను 150 చిత్రాకు పైగా నటించాను కనుక ఆ పాత్రలో నేను నటిస్తానని రూమర్స్ వచ్చి వుంటాయని అన్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చి

లక్ష్మీపార్వతి పాత్రను రోజా చేస్తుందంటూ వస్తున్న వార్తలపై సినీ నటి, ఎమ్మెల్యే రోజా స్పందించారు. రోజా ఎక్కడుంటే అక్కడ రూమర్స్ సహజమేననీ, తను 150 చిత్రాకు పైగా నటించాను కనుక ఆ పాత్రలో నేను నటిస్తానని రూమర్స్ వచ్చి వుంటాయని అన్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో LP... లక్ష్మీ పార్వతి పాత్రలో నటించాలని తనను వర్మ సంప్రదించలేదని వెల్లడించారు.
 
ఒకవేళ ఆయన తనను అడిగితే అప్పుడు ఆలోచిస్తానని చెప్పుకొచ్చారు. ఇకపోతే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తీయడంపై మంత్రి అమరనాథ్ రెడ్డి స్పందించారు. వర్మ ఎప్పుడు ఏం చేస్తాడో ఆయనకే తెలియదని అన్నారు. కాంట్రవర్సీలతో క్యాష్ చేసుకోవడం వర్మకు వెన్నతో పెట్టిన విద్య అనీ, ప్రస్తుతం వర్మ చేయాలనుకుంటున్నది కూడా అదేనన్నారు.