శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 10 అక్టోబరు 2017 (18:36 IST)

'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో రోజాకు చాన్స్ ఇస్తా... వర్మ, జయప్రద క్యారెక్టరా?(వీడియో)

స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తీయబోతున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా ఓ పాత్ర పోషిస్తారని దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. ఈ రోజు చిత్తూరు జిల్లా పలమనేరులో రాంగోపాల్ వర్మ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి ఇంటికి వెళ్లార

స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తీయబోతున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా ఓ పాత్ర పోషిస్తారని దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. ఈ రోజు చిత్తూరు జిల్లా పలమనేరులో రాంగోపాల్ వర్మ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ మీడియాతో ముచ్చటించారు. 
 
ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్లో ఎవర్నీ ఎంపిక చేయలేదనీ, ఐతే ఓ పాత్రలో మాత్రం వైసీపి ఎమ్మెల్యే రోజా నటిస్తారని చెప్పుకొచ్చారు. కాగా రోజా నటించే పాత్ర అనగానే తెలుగుదేశం పార్టీలో ఆనాడు ఎన్టీఆర్ జీవించి వుండగా జయప్రద చేరారు. మరి ఆమె పాత్రనేమైనా రోజా పోషిస్తారా అనే వార్తలు వస్తున్నాయి. 
 
మరోవైపు నిర్మాత రాకేష్ మాట్లాడుతూ... లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి ఎన్ని కోట్లు ఖర్చయినా భరిస్తాననీ, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదన్నారు. మీడియా ముఖంగా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాననీ, ఈ చిత్రంపై తనను ఎవరు బెదిరించినా బెదిరేది లేదన్నారు. చూడిండి ఆయన మాటల్లోనే... వీడియో...