గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (13:42 IST)

మల్టిపుల్ సెలిరోసిస్ వ్యాధితో బాధపడుతున్నా : ఎంఎం కీరవాణి

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి తన ఆరోగ్యంపై కీలక ప్రకటన చేశారు. తాను మల్టిపుల్‌ సెలిరోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నానని చెప్పారు. 
 
ఈ మేరకు సంగీత దర్శకుడు ఎం.‌ఎం‌. కీరవాణి ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. గత కొన్ని రోజులుగా ఆ వ్యాధితో బాధపడుతున్నానని వివరిస్తూ ఆయన ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వ్యాధి ఏ వయసువారికైనా, ఎప్పుడైనా రావచ్చని ఆయన తెలిపారు. ఇది మెదడు, శరీరానికి మధ్య ఉన్న అనుసంధానాన్ని దెబ్బతీస్తుందని ఆయన చెప్పారు.
 
దీనిపై ఎంఎస్‌ ఇండియా సంస్థ ప్రజల్లో అవగాహన కల్పిస్తోందని కీరవాణి తెలిపారు. ఈ వ్యాధితో బాధపడుతున్న వారంతా ధైర్యంగా ఉండేలా ఇతరులు వారికి సహకరించాలని ఆయన కోరారు. 
 
ఈ వ్యాధి ఉన్న వారు యోగా, సంగీతం‌ వంటి వాటితో కాస్త ఉపశమనం పొందవచ్చన్నారు. ఈ వ్యాధి గురించి సినీనటి విద్యా బాలన్ మాట్లాడిన వీడియోను కూడా కీరవాణి ఈ సందర్భంగా పోస్ట్ చేశారు.