గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 18 నవంబరు 2022 (23:34 IST)

ఉద్విగ్నభరితమైన క్రైమ్‌ ధ్రిల్లర్‌ ధారావీ బ్యాంక్‌తో ఒరిజినల్‌ కంటెంట్‌ను బలోపేతం చేస్తున్న ఎంఎక్స్‌ ప్లేయర్‌

Dharavi Bank
భారతదేశపు వినోద సూపర్‌ యాప్‌, ఎంఎక్స్‌ ప్లేయర్‌ తమ ఒరిజినల్‌ సిరీస్‌ వినోదాన్ని మరింత ఉన్నంతగా తీసుకువెళ్తూ, ఉద్విగ్నభరితమైన క్రైమ్‌ థ్రిల్లర్‌ ధారావీ బ్లాక్‌ను తమ ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులోకి తీసుకువచ్చింది. సమిత్‌ కక్కడ్‌ దర్శకత్వం వహించిన ఈ 10 ఎపిసోడ్ల సిరీస్‌లో తిరుగులేని తలైవన్‌గా సునీల్‌ శెట్టి కనిపించబోతున్నారు. తొలిసారిగా డిజిటల్‌ సిరీస్‌లో ఆయన కనిపించారు. ఈ సిరీస్‌ పవర్‌పుల్‌ పోలీస్‌ అధికారి జెసీపీ జయంత్‌ గవాస్కర్‌గా వివేక్‌ ఆనంద్‌ ఒబరాయ్‌ కనిపించనున్నారు. ఈ ధారావీ బ్యాంక్‌ సిరీస్‌ నవంబర్‌ 19, 2022 నుంచి ఎంఎక్స్‌ ప్లేయర్‌లో ప్రసారం కానుంది.
 
ధారావీ బ్యాంక్‌ అత్యంత క్లిష్టమైన కథ. కేవలం నేర సామ్రాజ్యాన్ని అంతమొందించడం మాత్రమే కాదు, అంతకుమించి ఈ కథలోఉంటుంది. యాక్షన్‌, ఎమోషన్‌ సమతూకంలో ఉన్న ఈ సిరీస్‌లో కుటుంబం, గౌరవం, శక్తి మరియు విధి కోసం చేసే పోరాటం కనిపిస్తుంది. అయితే ఈ పోరాటంలో ఎవరు విజయం సాధిస్తారు?
 
ఈ వెబ్‌సిరీస్‌ గురించి ఎంఎక్స్‌ ప్లేయర్‌ చీఫ్‌ కంటెంట్‌ ఆఫీసర్‌ గౌతమ్‌ తల్వార్‌ మాట్లాడుతూ, ‘పరిశ్రమలో అత్యుత్తమ ప్రతిభావంతులతో మేము చేతులు కలిపాము. సునీల్‌ శెట్టి, వివేక్‌ ఆనంద్‌ ఒబరాయ్‌లు పోటాపోటీగా దీనిలో నటించారు. మా గత సిరీస్‌లు ఆశ్రమ్‌, మత్స్య కాండ్‌, క్యాంపస్‌ డైరీస్‌ విజయవంతమైనట్లుగానే ఇది కూడా విజయం సాధించగలదని ఆశిస్తున్నాను’’ అని అన్నారు. ఇందోరీ ఇష్క్‌ తరువాత తాను ఎంఎక్స్‌ప్లేయర్‌తో చేస్తున్న రెండవ సిరీస్‌ ధారావీ బ్యాంక్‌ అని దర్శకుడు సమిత్‌ కక్కడ్‌ అన్నారు. ధారావీ దగ్గరలో పెరిగిన తాను ప్రేక్షకులకు అతి తక్కువగా తెలిసిన ధారావీని పరిచయం చేస్తున్నాన్నారు.
 
తలైవన్‌గా కనిపించనున్న సునీల్‌ శెట్టి మాట్లాడుతూ, ఈ సిరీస్‌ కోసం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్నారు. నెగిటివ్‌ షేడ్స్‌ కలిగిన ఓ క్లిష్టమైన పోలీస్‌ పాత్ర చేశానని వివేక్‌ ఆనంద్‌ ఒబరాయ్‌ అన్నారు. జీ స్టూడియోస్‌ నిర్మించిన ఈ సిరీస్‌లో సోనాలీ కులకర్ణి, ల్యూక్‌ కెన్నీ, ఫ్రెడ్డీ దారూవాలా, శాంతిప్రియ తదితరులు నటించారు. ఎంఎక్స్‌ ప్లేయర్‌పై మాత్రమే 19 నవంబర్‌ 2022నుంచి ధారావీ బ్యాంక్‌ ప్రసారం కానుంది.