బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2022 (08:07 IST)

సస్పెన్స్, థ్రిల్లర్ నేపథ్యంలో రహస్య

Lion Saivenkat, Nivas and others
Lion Saivenkat, Nivas and others
డిఫరెంట్ కాన్సెప్ట్ తో  రూపుదిద్దుకుంటున్న చిత్రం "రహస్య" యస్. యస్. యస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ పై నివాస్ శిష్టు,  సారా ఆచార్ జంటగా శివ శ్రీ మీగడ దర్శకత్వంలో  గౌతమి. ఎస్ ఈ చిత్రాన్ని తెరకేక్కిస్తున్నారు. ఇంతకుముందు విడుదల చేసిన "రహస్య" ఫస్ట్ లుక్ పోస్టర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ఈ చిత్రం  గ్లిమ్స్ ను విడుదల చేశారు.
 
 *చిత్ర హీరో నివాస్ మాట్లాడుతూ...* ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాను. ఇందులో విశ్వతేజ అనే పాత్రలో  NIA అధికారిగా నటిస్తున్నాను. థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో డిఫరెంట్ కోణాలను టచ్ చేస్తూ సస్పెన్స్ మిస్టరీని ప్రేక్షకుల ముందుంచబోతున్నాము. 
ఈ సినిమాకు చరణ్ అర్జున్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. డైరెక్షన్ టీం  అంతా చాలా కష్టపడ్డారు. అందరూ ఈ సినిమాను ఓన్ చేసుకొని వర్క్ చేశారు. మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. 
 
 *'మీలో ఒకడు'  హీరో కుప్పిలి శ్రీనివాస్ మాట్లాడుతూ...* "రహస్య" సినిమాను చాలా బాగా తీశారు. త్వరలో రిలీజ్ కాబోతున్న "రహస్య" అనేది ఏమిటి అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా ప్రోమోస్, సాంగ్స్ చూస్తుంటే రియల్ గా పోలీస్ లు వచ్చి చేస్తున్నారా అన్నట్టు చాలా రియల్ గా ఉంది. హీరో, హీరోయిన్ ల నటన కూడా చాలా బాగుంది. దర్శక, నిర్మాతలు ఈ చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించారు. అలాగే చరణ్ అర్జున్ సాంగ్స్ బాగున్నాయి. హీరో నివాస్ కు ఈ సినిమాతో మంచి పేరు వస్తుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న రహస్య సినిమాను ప్రతి ఒక్కరూ థియేటర్స్ కు వచ్చి టీంను  ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
 
 *లయన్ సాయివెంకట్ మాట్లాడుతూ...* "రహస్య" సాంగ్స్ ప్రోమో చూశాను. మేకింగ్ చాలా బాగుంది. ఇందులో థ్రిల్లింగ్ మిస్ట్రీ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. ఇలాంటి జోనర్స్ కు తెలుగు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ తో చూడడమే కాకుండా  చక్కగా అదరిస్తారు. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ ను సెలక్ట్ చేసుకొని చాలా బాగా తీశారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో నటించిన నటీ నటులకు, టెక్నిషియన్స్ కు, దర్శక, నిర్మాతలకు ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.
 
*ఏయ్ బుజ్జి నీకు నేనే హీరో సతీష్  మాట్లాడుతూ...* సాంగ్స్  గ్లిమ్స్ చూశాము. చాలా థ్రిల్లింగ్ గాను అలాగే చాలా సస్పెన్స్  క్రియేట్ చేస్తున్న ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అనుకుంటున్నాను. హీరో నివాస్  చాలా చక్కగా నటించారు.. టీం అందరికి అల్ ద బెస్ట్ అన్నారు.