సీఎం కె.సి.ఆర్‌ను కలుసుకుని కృతజ్ఞతలు తెలియజేసిన డైరెక్టర్ ఎన్.శంకర్
ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్‌కు తెలంగాణలో సినిమాను అభివృద్ధి చేసే నిమిత్తం ఐదెకరాల స్థలాన్ని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. జీవో ప్రకారం శంకరపల్లిలోని మోకిల్లలో స్టూడియో నిర్మాణం కోసం ఐదెకరాల భూమిని కేటాయించారు. తెలంగాణ సినిమా ఉన్నతి కోసం ముఖ్యమంత్రి చేసిన సహకారానికి దర్శకుడు ఎన్.శంకర్ ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా కలిసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.