శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: గురువారం, 12 జులై 2018 (20:16 IST)

నాగ్ - నానిల దేవ‌దాస్ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ కింగ్ నాగార్జున - నేచుర‌ల్ స్టార్ నాని క‌లిసి దేవ‌దాస్ సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ పైన అశ్వ‌నీద‌త్ నిర్మిస్తున్నారు. ఇందులో నాగ్ డాన్‌గా న‌టిస్తుంటే.. నాని డాక్ట‌ర్‌గా న‌టిస్తున్నాడు. ఇటీవ‌ల న

టాలీవుడ్ కింగ్ నాగార్జున - నేచుర‌ల్ స్టార్ నాని క‌లిసి దేవ‌దాస్ సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ పైన అశ్వ‌నీద‌త్ నిర్మిస్తున్నారు. ఇందులో నాగ్ డాన్‌గా న‌టిస్తుంటే.. నాని డాక్ట‌ర్‌గా న‌టిస్తున్నాడు. ఇటీవ‌ల నాగ్ - నాని పైన ఓ పాట‌ను చిత్రీక‌రించారు. ఇటీవ‌ల లీకైన నాగ్ డిఫ‌రెంట్ గెట‌ప్ స్టిల్ ఈ సినిమాలోనిదే అంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే.. అది ఈ మూవీలోదా కాదా అనేది తెలియాల్సి వుంది.
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ చిత్రాన్ని వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. తాజా స‌మ‌చారం ప్ర‌కారం.. ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 27న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ట‌. దేవ‌దాస్ అని టైటిల్ ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి ఈ ప్రాజెక్ట్ పైన మ‌రింత క్రేజ్ పెరిగింది. మ‌రి... అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా దేవ‌దాస్ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడ‌ని ఆశిద్దాం.