శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 నవంబరు 2023 (10:42 IST)

డీప్‌ఫేక్ వీడియోపై చిన్మయి స్పందన... లోన్ యాప్స్‌పై ఫైర్

Chinmayi Sripada
సినీనటి రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియోపై గాయని శ్రీపాద చిన్మయి స్పందించారు. సెలబ్రిటీలను మాత్రమే కాదని, ఇలాంటి వీడియోలతో సామాన్యులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఏఐ దుర్వినియోగంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరిన ఆమె.. దోపిడీ, బ్లాక్‌మెయిల్, అత్యాచారం వంటివాటికి డీప్‌ఫేక్ టెక్నాలజీని తదుపరి ఆయుధంగా మార్చుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.  
 
మరీ ముఖ్యంగా లోన్‌యాప్‌ల నిర్వాహకులపై చిన్మయి మరింత ఆందోళన వ్యక్తం చేశారు. డీప్‌ఫేక్ టెక్నాలజీతో రూపొందించిన వాటిని సాధారణ కంటితో గుర్తించడం కష్టమని తెలిపారు.