శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 అక్టోబరు 2020 (11:12 IST)

బిగ్ బాస్‌ నుంచి ఎలిమినేట్ అయితే ఏడవలా? కరివేపాకు గురించి నాగార్జున..?

బిగ్ బాస్ హౌస్ నుంచి ఆరోవారంలో ఎలిమినేట్ అయిన కుమార్ సాయి నవ్వుతూ పాజిటివ్ వైబ్రేషన్స్‌తో బయటకు వచ్చేశారు. ఆయన ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అని చాలామంది ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. అయితే బయటకు వచ్చిన తరువాత బిగ్ బాస్ హౌస్ పరిస్థితులపై మాట్లాడారు. హౌస్‌లో ఎవరు ఎలా ఉంటున్నారు? తన ఎలిమినేషన్‌కి కారణం ఏంటి? బిగ్ బాస్ పెట్టిన కండిషన్స్ ఏంటి తదితర విషయాలపై క్లారిటీ ఇచ్చారు కుమార్ సాయి. ఎలిమినేట్ అయినందుకు బాధ లేదు.. బయటకు వచ్చాకే బాధ అనిపిస్తుంది.
 
బిగ్ బాస్ ఛాన్స్ వచ్చినందుకు ఆనందంగానే ఉంది కానీ.. హౌస్ నుంచి ఎలిమినేట్ అయినందుకు బాధగానే ఉంది. హౌస్‌లో ఉన్నప్పుడు బయట పరిస్థితులు ఏంటో నాకు తెలియవు కాబట్టి.. పెద్దగా బాధపడలేదు. ఆట వరకూ మనం ఆడతాం.. రిజల్ట్ అనేది ప్రేక్షకుల ఓట్లు కాబట్టి దానితో ఏకీభవించా. సంతోషంగానే బయటకు వచ్చేశా. కానీ బయటకు వచ్చిన తరువాతే అసలు బాధ మొదలైంది. అందరూ బాధపడుతున్నారు.. ఓట్లు వేశాం.. నువ్ ఎలా ఎలిమినేట్ అయ్యావ్ సోదరా? అంటున్నారు.
 
ఇంకా నన్ను కన్ఫ్యూజ్ మాస్టర్‌గా హౌస్‌లో చిత్రీకరించారు. నన్ను హౌస్‌లో ఉన్న వాళ్లు నన్ను అర్థం చేసుకోవడంలో కన్ఫ్యూజ్ అయ్యారు. వాళ్లకి అర్థంకాక నన్ను కన్ఫ్యూజ్ అనేవారు. అఖిల్‌ కరివేపాకు.. పనికి రాడని నేను అనను. కరివేపాకు గురించి నాగార్జున నాకు చెప్పింది ఏంటంటే.. ఎందుకూ పనికి రానిది అని అన్నారు. కానీ నాకు అంత పెద్ద మాట అనాలని అనిపించలేదు.. ఎందుకంటే ఎవరూ పనికి రాకుండా అయితే ఉండరు. ఎందుకైనా పనికి వస్తారు.. టైం రావాలి అంతే. ఆయన చెప్పారు కదా అని అఖిల్‌ని నేను అలా అనాలని పించలేదు. 
 
కరివేపాకు అనేది కూరలో వేసినప్పుడు ఫ్లేవర్ రావడం లేదని చెప్పాను. ఏ ఉద్దేశంలో అంటే అఖిల్ ఆట ఆడుతున్నాడు కానీ ఫెయిల్ అవుతున్నాడు ఫోకస్ వేరే వైపుకి వెళ్తుంది అని.. హౌస్‌లో అందరూ అఖిల్‌కి చెప్పకపోయినా వెనుక మాట్లాడుకుంటారు. టాస్క్‌కి వెళ్తున్నాడు అంటే ఓడిపోతాడు అని నవ్వుకుంటున్నారు. అది చాలాసార్లు చెప్పడానికి ట్రై చేశా.. చెప్పాకూడా.. కానీ పట్టించుకోలేదు.
 
అఖిల్ మాటకు పెద్దగా బాధపడలేదు కానీ.. నీ ఎఫర్ట్‌ని తీసిపారేయకూడదు.. నమిలి తినేయాలి.. ఆస్వాదించాలి.. అనే ఉద్దేశంతో చెప్పా. కానీ అఖిల్ నెగిటివ్‌గా ఆలోచించాడు. నువ్ సరిగా ఆడినా అక్కడ ఉన్నావ్ నేను ఇక్కడ ఉన్నాను అని అన్నాడు.. నేను ఎలిమినేట్ అయిపోయాను.. ఇక కంటెస్టెంట్ కాదు కాబట్టి ఏం మాట్లాడలేదు. పెద్దగా ఫీల్ అవ్వలేదు.
 
ఫస్ట్ నేను వెళ్లినప్పుడు కంఫర్ట్‌గా అనిపించలేదు.. కొంతమంది కంఫర్ట్ జోన్ ఏర్పాటు చేసుకున్నారు. కానీ తరువాత నాకు ఏం అర్థమైందంటే.. ఎంత కంఫర్ట్ జోన్‌లో ఉన్నాసరే సింగిల్‌గానే ఆడుతున్నారు. పైకి మాత్రం నటిస్తూ ఉన్నారని తెలిసింది. వైల్డ్ కార్డ్ ద్వారా వెళ్లడం నాకు మైనస్ అంటూ చెప్పుకొచ్చాడు.