సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 నవంబరు 2023 (15:44 IST)

బాలకృష్ణ 109 సినిమా నుంచి క్రేజీ అప్డేట్

Balakrishna-ganesh song
నందమూరి నటసింహం, బాలకృష్ణ 109 సినిమాకు సంబంధించి తాజాగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే బాలయ్య పుట్టినరోజు సందర్భంగా.. మందు బాటిల్, మారణాయుధాలతో బాలకృష్ణ 109వ సినిమా పోస్టర్ విడుదల చేయగా ఇప్పుడు మరో క్రేజీ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. 
 
ఇందుకు సంబంధించిన పోస్టర్‌కు "బ్లడ్ బాత్ కా బ్రాండ్ నేమ్, వయోలెన్స్ కా విజిటింగ్ కార్డ్ నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ ఎన్బీకే 109 సినిమా షూటింగ్ ప్రారంభం" అని రాసుకొచ్చారు. 
 
ఇదిలా ఉంటే బాలకృష్ణ 109 చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.