శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (15:57 IST)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బాలకృష్ణ- ఎన్టీఆర్ బయోపిక్‌లో?

నందమూరి హీరో బాలకృష్ణ కుడిభుజానికి శనివారం ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. శనివారం కాంటినెంటల్ ఆస్పత్రిలో బాలయ్య కుడిభుజానికి శస్త్రచికిత్స పూర్తికావడంతో సోమవారం ఆయన ఆస్పత్రి నుంచి డి

నందమూరి హీరో బాలకృష్ణ కుడిభుజానికి శనివారం ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. శనివారం కాంటినెంటల్ ఆస్పత్రిలో బాలయ్య కుడిభుజానికి శస్త్రచికిత్స పూర్తికావడంతో సోమవారం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్‌ సందర్భంగా బాలయ్య...ఆర్థోపెడిక్‌ సర్జన్‌తో కలిసి దిగిన ఫోటోను సౌత్‌ ఇండియన్‌ మూవీస్‌ పీఆర్‌వో బీఏ రాజు ట్విట్టర్‌లో షేర్ చేశారు.
 
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్మ కుడిచేతికి గాయమైంది. అయితే అప్పట్లో బాలయ్య ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. కానీ రొటేట‌ర్ క‌ఫ్ టియ‌ర్ ఆఫ్ షోల్డర్‌తో బాధపడుతూ వచ్చిన బాలయ్యకు నొప్పి తీవ్రత అధికం కావడంతో సర్జరీ చేసుకోవాల్సి వచ్చింది. సర్జరీ పూర్తి కావడంతో రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో వున్న బాలయ్య.. సోమవారం డిశ్చార్జ్ అయ్యారు.
 
57 ఏళ్ల నందమూరి హీరో బాలయ్య భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాక తన తండ్రి, తెలుగుదేశం వ్యవస్థాపకులు, సినీ హీరో ఎన్టీఆర్ బయోపిక్‌లో నటిస్తారని తెలుస్తోంది.