శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 2 మార్చి 2017 (09:38 IST)

నంది అవార్డులు : పవన్ - మహేష్‌లను ఎంపిక చేయకపోవడానికి కారణమిదే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2012, 13 సంవత్సరాలకుగాను నంది ఫిల్మ్ అవార్డులను తాజాగా ప్రకటించింది. అయితే, 2013 సంవత్సరానికిగాను ఉత్తమ నటుడిగా ప్రభాస్ పేరును ప్రటించారు. వాస్తవానికి ఈ యేడాదిలో మరో ఇద్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2012, 13 సంవత్సరాలకుగాను నంది ఫిల్మ్ అవార్డులను తాజాగా ప్రకటించింది. అయితే, 2013 సంవత్సరానికిగాను ఉత్తమ నటుడిగా ప్రభాస్ పేరును ప్రటించారు. వాస్తవానికి ఈ యేడాదిలో మరో ఇద్దరు పెద్ద హీరోల చిత్రాలు విడుదలయ్యాయి. అవి కూడా సూపర్ హిట్ అయ్యాయి. వీరిద్దరే పవన్ కళ్యాణ్ (అత్తారింటికి దారేది), మహేష్ బాబు (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు). వాస్తవానికి ప్రభాస్ 'మిర్చి' కంటే పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' చిత్రం మంచి ప్రేక్షకాధారణ పొందింది. కానీ, ఉత్తమ నటుడిగా 'మిర్చి' చిత్రానికి గాను ప్రభాస్ పేరును ప్రకటించారు. అయితే, పవన్ లేదా మహేష్ బాబులను ఎంపిక చేయకపోవడానికి కారణం లేకపోలేదని జ్యూరీ సభ్యులు చెపుతున్నారు. 
 
నిజానికి హీరో ప్రభాస్‌గానీ, మిర్చి మూవీగానీ అసలు చాయిసే కాదని జ్యూరీ సభ్యుల్లో ఒకరు వెల్లడించారు. అత్తారింటికి దారేది సినిమాకుగాను పవన్ కళ్యాణ్‌ని ఉత్తమ నటుడిగా ఎంపిక చేయాలని జ్యురీలోని మెజారిటీ సభ్యులు సూచించగా, కొంతమంది మహేష్ బాబు వైపు మొగ్గు చూపారు. దీంతో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై వాదులాట తలెత్తింది. 
 
ప్రస్తుతం టీడీపీలో చురుకుగా ఉన్న సీనియర్ నటుడొకరు.. ప్రభాస్‌ని సెలెక్ట్ చేయాలని పట్టుబట్టారట. పవన్‌ని సెలెక్ట్ చేస్తే అది టీడీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టవచ్చునని, అలాగే మహేష్ బాబును ఎంపిక చేస్తే ఆయన బావ (గల్లా జయదేవ్) టీడీపీలో ఉన్నారు గనుక అది కూడా తప్పుడు సంకేతాలనే ఇచ్చినట్లవుతుందని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
 
దీంతో మధ్యేమార్గంగా ప్రభాస్‌ని ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఉత్తమ చిత్రంగా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాని ఎంపిక చేస్తారని ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎంతో ఆశించినా జ్యూరీ ఆ చిత్రాన్ని, 'అత్తారింటికి దారేది' సినిమాను కాదని 'మిర్చి'ని ఎంపిక చేసింది.