శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2019 (18:45 IST)

బాలీవుడ్ తరహాలో కొత్త ట్రెండ్...నాని కొనసాగుతాడా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రయోగాత్మక చిత్రాలు తక్కువగానే వస్తుంటాయి. కానీ, ఈ మధ్యకాలంలో నేటి తరం రచయితలు కొత్త కథలతో ముందుకు వస్తున్నారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా కొన్ని ప్రయోగాత్మక సినిమాలు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిపోతున్నాయి. తాజాగా న్యాచురల్ స్టార్ నాని చేయబోతున్న సినిమా కూడా ట్రెండ్ సెట్టర్‌గా నిలవబోతోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
 
టాలీవుడ్ హీరోలు కూడా తమ ఇమేజ్‌ను పక్కన పెట్టి సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఈ మధ్యన నేచరల్ స్టార్ నాని జెర్శీ సినిమా తర్వాత ‘గ్యాంగ్ లీడర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, అది పెద్దగా ఆడలేదు. ఈ సినిమాకు ముందే అతడు ‘V' అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నాని ఇందులో విలన్‌గా కనిపించబోతున్నాడంటూ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ మూవీలో సుధీర్ బాబు హీరోగా నటిస్తుండగా, నివేదా థామస్, అతిథి రావు హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.