మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 2 డిశెంబరు 2023 (17:41 IST)

పవిత్రతో ఫిలిప్పీన్స్ సముద్ర సాహసయాత్రలో ఎంజాయ్ చేస్తున్న నరేష్

Naresh,  Philippines
Naresh, Philippines
సీనియర్ నరేష్ తన భార్య పవిత్ర లోకేష్ తో ఫిలిప్పీన్స్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు పోస్ట్ చేసి తన ఆనందాన్ని పంచారు. ఇటీవలే పవిత్రతో ఫిలిప్పీన్స్ సముద్ర సాహసయాత్రలో హెలికాప్టర్ లో ద్వీపంలోని అద్భుతాలను అన్వేషించారు. ఎల్ నిడో ద్వీపానికి కూడా ప్రయాణించారు, రహస్య సరస్సు బీచ్ యొక్క అందాలను ఆవిష్కరిస్తూ, మా భాగస్వామ్య ప్రయాణానికి మరిన్ని చిరస్మరణీయ క్షణాలను జోడించారు. ఈ జ్ఞాపకాలు నిజంగా అమూల్యమైనవి అని తెలిపాడు.
 
Naresh,  Philippines, Pavitra
Naresh, Philippines, Pavitra
ఇటీవలే నరేష్ కు ఫిలిప్సీన్ ప్రభుత్వం నుంచి సర్ అనే బిరుదు ప్రదానం చేసింది. ఇటీవలే ఆయనకు డాక్టరేట్ కూడా వచ్చింది. ఈ సందర్భంగా ఆయన అక్కడకు వెళ్ళారు. ఇది చాలా గౌరవమైందని ఆయన తెలిపారు. నటుడిగానే కాకుండా పలు సేవా కార్యక్రమాలను చేసినందుకు గుర్తింపుగా నాకు సర్ బిరుదు వచ్చింది అని తెలిపారు.