శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 20 మార్చి 2024 (16:05 IST)

నార్నే నితిన్‌, న‌య‌న్ సారిక మ‌ధ్య కెమిస్ట్రీ పై ఆయ్.. ముంచి మెలోడి సాంగ్

Narne Nithin - Nayan Sarika
Narne Nithin - Nayan Sarika
నార్నే నితిన్‌, న‌య‌న్ సారిక జంటగా నటిస్తున్న చిత్రం ఆయ్. GA2 పిక్చర్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.9గా రూపొందుతోన్న చిత్రం అంజి కంచిపల్లి దర్శకత్యంలో బన్నీ, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్నారు. ఆయ్ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. రీసెంట్‌గా టైటిల్ రివీల్‌కు సంబంధించిన కాన్సెప్ట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవటమే కాకుండా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకుంది.. అలాగే ఫస్ట్ లుక్‌కి కూడా మంచి స్పందన వచ్చింది.
 
 ప్రమోషన్స్‌లో మరింత వేగాన్ని పెంచుతూ ఈ చిత్రం నుంచి అంద‌రినీ ఆక‌ట్టుకునేలా ‘సూఫియానా..’ అనే పాట‌ను మేక‌ర్స్ విడుద‌ల చేయ‌గా పాట అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. రామ్ మిర్యాల ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా  రామ్ మిర్యాల‌, స‌మీర భ‌ర‌ద్వాజ్‌, ర‌మ్య‌శ్రీ పాడారు. ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత శ్రీమ‌ణి ఈ పాట‌కు సాహిత్యాన్ని అందించారు. చ‌క్క‌గా అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా ఈ లిరికల్ సాంగ్ ఆక‌ట్టుకుంటోంది.
 
అంద‌మైన లొకేష‌న్స్‌, బ్యాగ్రౌండ్‌తో అల‌రించే గోదావ‌రి అందాలు, నార్నే నితిన్‌, న‌య‌న్ సారిక మ‌ధ్య క‌నిపిస్తోన్న కెమిస్ట్రీ ప్రేక్ష‌కుల‌ను మైమ‌ర‌పింప చేస్తుంది. సింపుల్ కొరియోగ్ర‌ఫీలో ‘సూఫియానా..’ మెలోడి సాంగ్ అంద‌రి హృద‌యాల‌ను ఆక‌ట్టుకుంటుంది. నితిన్‌, న‌య‌న్ సారిక జోడి సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూడ చ‌క్క‌గా ఉంది. ఈ సాంగ్ అంద‌రి ప్లే లిస్టులో మొద‌టిస్థానంలో ఉంటూ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంద‌న‌టంలో సందేహం లేదు.
 
 అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతోన్న ఈ  సినిమాకు కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా, సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేశారు.