శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (17:04 IST)

బాహుబలి బెస్ట్ యాక్షన్ డైరెక్షన్... అబ్బే అతడెవరో మాకు తెలీదు... శోభు యార్లగడ్డ ట్వీట్

అవార్డుల ప్రకటించేటపుడు ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని ప్రకటిస్తుంటారు. కానీ నేషనల్ అవార్డుల ప్రకటన సందర్భంలో బాహుబలికి ప్రకటిచిన మూడు అవార్డుల్లో ఒక అవార్డుకు సంబంధించి కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఇంతకీ విషయం ఏంటయా అంటే... బాహుబలి 2 మూవీ మూడు నేషనల్

అవార్డుల ప్రకటించేటపుడు ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని ప్రకటిస్తుంటారు. కానీ నేషనల్ అవార్డుల ప్రకటన సందర్భంలో బాహుబలికి ప్రకటిచిన మూడు అవార్డుల్లో ఒక అవార్డుకు సంబంధించి కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఇంతకీ విషయం ఏంటయా అంటే... బాహుబలి 2 మూవీ మూడు నేషనల్ అవార్డులను సొంతం చేసుకున్నట్లు జ్యూరీ చీఫ్ శేఖర్ కపూర్ ప్రకటించారు. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ పాపులర్ ఫిల్మ్, బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ కేటగిరీల్లో బాహుబలి 2కి అవార్డులు వచ్చాయని చెప్పిన ఆయన బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ కింద అబ్బాస్ అలీ మొఘుల్ అనే వ్యక్తి పేరును తెలిపారు.
 
 అయితే ఆ మూడో అవార్డు కోసం ప్రకటించిన వ్యక్తి తమతో పనిచేయలేదంటూ బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ట్వీట్ చేయడంతో అవార్డుల ప్రకటనలో పొరబాటు చోటుచేసుకుందని తెలుస్తోంది. అసలు విషయానికి వస్తే బాహుబలి రెండు పార్ట్‌లకు యాక్షన్ డైరెక్టర్‌గా పీటర్ హెయిన్ పనిచేయగా ఆయన పేరుకు బదులు అబ్బాస్ అలీ మొఘల్ అనే వ్యక్తి పేరును ప్రకటించారు. దీనితో ఇప్పుడు బాహుబలికి వచ్చింది రెండు అవార్డులా మూడా అనేది సస్పెన్సుగా మారింది.