గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 15 సెప్టెంబరు 2019 (11:04 IST)

బ్లూ రంగు చీరలో మెరిసిన నయనతార.. పెళ్లి విషయంలో జాగ్రత్త..

అగ్ర హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి ప్రస్తావన మళ్లీ తెరపైకి వచ్చింది. దర్శకుడు విఘ్నేష్ శివన్‌లో పరిచయం ప్రేమగా మారింది. ఈ సారి నయనతార కాస్త జాగ్రత్త పడింది.

ముందుచేసిన తప్పులు మళ్లీ చేయకుండా విఘ్నేశ్‌శివన్‌తో తన ప్రేమను సహజీవనంగా మార్చుకుంది. అవును వారిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. ఒకే ఇంటిలో నివశిస్తూ ఒకరికొకరుగా కలిసి జీవిస్తున్నారు. ఈ జీవితాన్ని వారు మూడు బర్త్‌డేలు, ఆరు విహారయాత్రలుగా ఎంజాయ్‌ చేస్తున్నారు.
 
అయితే ఇక్కడ దర్శకుడు విఘ్నేశ్‌శివన్‌ కుటుంబసభ్యులు పెళ్లి చేసుకోమని ఆయనపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో నయనతార నీలపు రంగు చీరలో మెరిసిపోతుంది. 
 
చాలాకాలం తర్వాత ఆమె తెలుగులో చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న ''సైరా నరసింహారెడ్డి''లో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. నయనతార మరోవైపు తమిళంలో ఇటూ హీరోయిన్‌గా చేస్తూనే మరో పక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలతో దుమ్ము దులుపుతోంది. తాజాగా నీలపు రంగు చీరలో అదరగొడుతోంది.