నన్ను చంపేందుకు నారా లోకేశ్ ఆర్మీ కుట్ర : పోలీసులకు ఆర్కే ఫిర్యాదు

alla ramakrishna reddy
Last Updated: ఆదివారం, 18 ఆగస్టు 2019 (17:06 IST)
తనను చంపేందుకు నారా లోకేశ్ ఆర్మీ కుట్ర పన్నుతోందని మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆర్. రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన స్థానిక తాడేపల్లిలోని పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.

ఆయన చేసిన ఫిర్యాదులో "నాని చౌదరి, లోకేశ్ టీమ్ పేరుతో సోషల్ మీడియాలో నన్ను బెదిరిస్తూ పోస్టులు పెడుతున్నారు. చెన్నై టీడీపీ ఫోరమ్ పేరుతో సైతం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. మా నాయకుడు జగన్‌ను జైలుకు పంపుతామనీ, నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు" అని వ్యాఖ్యానించారు. తెదేపా శ్రేణుల నుంచి తనకు ప్రాణహానీ ఉందనీ, తనకు భద్రత కల్పించాలని పోలీసులను ఆర్కే కోరారు.

అంతేకాకుండా, కరకట్ట ప్రాంతం కూడా తన నియోజకవర్గంలో భాగమని, అందుకే తాను అక్కడ పర్యటించానని చెప్పారు. అంతేగానీ, తాను టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలోకి వెళ్లలేదని క్లారిటీ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినా టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పును చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ ఇప్పటికీ ఓర్వలేక పోతున్నారంటూ మండిపడ్డారు.దీనిపై మరింత చదవండి :