ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 జులై 2022 (11:06 IST)

మెడలో పసుపు తాడు.. ముంబైలో మెరిసిన నయనతార (video)

Nayantara
Nayantara
దక్షిణాది అగ్ర హీరోయిన్ నయనతార పెళ్లికి తర్వాత ముంబై షూటింగ్‌లో పాల్గొంటోంది. షారూఖ్ ఖాన్‌తో సినిమా చేస్తున్న నయనతార ముంబై ఎయిర్ పోర్టులో ఆమె కెమెరా కంటికి చిక్కింది. ఒక షార్ట్ ట్రిప్ కోసం ఆమె చెన్నై నుంచి ముంబైకి వచ్చింది. 
 
బ్లాక్ ఔట్ ఫిట్‌లో ఎంతో గ్లామరస్‌గా కనిపిస్తున్న నయన్ మెడలో ఉన్న మంగళసూత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మాస్క్ ధరించి, ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తున్న ఆమెను కెమెరామెన్లు క్యాచ్ చేశారు. 
 
ఎయిర్ పోర్టు వెలుపలికి వచ్చిన నయన్... కారెక్కి వెళ్లిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
దక్షిణాది అగ్ర సినీ కథానాయిక నయనతార ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తమిళ సినీ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న నయన్... ఆయనను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.