శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 24 మార్చి 2018 (16:07 IST)

నయనతార పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరో తెలుసా? ఆమే చెప్పేసింది?

నయనతార లేడి సూపర్ స్టార్‌గా మారిపోయింది. దక్షిణాది భాషల్లో నటిస్తూ.. అంచెలంచెలుగా అగ్ర హీరోయిన్‌గా రాణించిన ఈ ముద్దుగుమ్మ త్వరలో పెళ్లి కూతురు కాబోతోందని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వస్తోంది. గతంలో శింబు,

నయనతార లేడి సూపర్ స్టార్‌గా మారిపోయింది. దక్షిణాది భాషల్లో నటిస్తూ.. అంచెలంచెలుగా అగ్ర హీరోయిన్‌గా రాణించిన ఈ ముద్దుగుమ్మ త్వరలో పెళ్లి కూతురు కాబోతోందని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వస్తోంది. గతంలో శింబు, ప్రభుదేవాలతో ప్రేమాయణం సాగించిన నయనతార.. వారితో బ్రేకప్‌కు తర్వాత యువ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌కు చేరువైంది. 
 
ఈ క్రమంలో వీరిద్దరూ సహజీవనం చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఇంకా నయన్-విఘ్నేష్ ఇద్దరూ కలిసి విదేశాల్లో ట్రిప్పులేయడం.. ఆ ఫోటోలను షేర్ చేయడం ద్వారా వీరిద్దరూ ప్రేమపక్షులని.. త్వరలోనే వీరి వివాహం అట్టహాసంగా జరుగబోతోందని టాక్ వచ్చింది. అయితే నయనతార-విఘ్నేష్ తమ ప్రేమాయణం, పెళ్లి గురించి ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. 
 
తాజాగా 'ది హిందూ' ఆంగ్ల దినపత్రిక చెన్నైలో నిర్వహించిన ''వరల్డ్ ఆఫ్ ఉమెన్-2018'' అవార్డుల ప్రదానోత్సవంలో సౌతిండియా లేడీ సూపర్ స్టార్ హీరోయిన్ నయనతార చీరలో మెరిసింది. ఈ సందర్భంగా నటనా రంగంలో ఎక్స్‌లెన్స్ అవార్డును అందుకున్న ఈ మలయాళ ముద్దుగుమ్మ.. తనకు కాబోయే భర్త ఎవరనే విషయాన్ని స్పష్టం చేసింది. 
 
అవార్డును అందుకున్న సందర్భంగా నయనతార తన తల్లిదండ్రులకు, సోదరుడికి కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాకుండా తనకు కాబోయే భర్త విఘ్నేశ్‌ని గురించి  కూడా ప్రస్తావించింది. అతనికి కూడా కృతజ్ఞతలు తెలిపింది. దీంతో ఇంతకాలంగా నయనతార పెళ్లి చేసుకోబోయేది విఘ్నేశ్‌నా? కాదా? అన్న సందేహం తీరిపోయినట్లైంది. 
 
''నానుమ్ రౌడీ ధాన్'' చిత్రం షూటింగ్ సందర్భంగా విఘ్నేశ్-నయన్ మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లిపీటలెక్కనున్నారని కోలీవుడ్‌లో చర్చ మొదలైంది. అలాగే సోషల్ మీడియాలోనూ నయనతార-విఘ్నేష్‌ల ప్రేమాయణం, పెళ్లిపై వాదనలు మొదలయ్యాయి.