గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 ఆగస్టు 2022 (11:14 IST)

నిత్యామీనన్‌‌ను వదలని యూట్యూబర్.. పెళ్లి వదంతులు అతడి వల్లే..

nithya menon
హీరోయిన్ నిత్యామీనన్‌‌ను యూట్యూబర్ వేధిస్తున్నాడు. గత కొన్ని నెలలుగా తన పెళ్లి విషయంలో వస్తున్న పుకార్లకు కారణం ఏంటనే దానిపై హీరోయిన్‌ నిత్యామీనన్‌ స్పందించారు. పుకార్ల వెనుక ఓ యూట్యూబర్‌ ఉన్నాడని, అతడే తనను 6 ఏళ్లుగా వేధిస్తున్నాడని చెప్పారు. 
 
"ఈ పుకార్లకు ప్రధాన కారణం సంతోష్‌ వర్కీ అనే ఓ యూట్యూబర్‌. అతడు ఆరేళ్లుగా నన్ను వేధిస్తున్నాడు. నా కుటుంబాన్ని కూడా వదలటం లేదు. వేర్వేరు ఫోన్‌ నెంబర్ల నుంచి నాకు ఫోన్‌ చేసి విసిగిస్తున్నాడు.
 
ఇప్పటివరకు అతడికి సంబంధించిన 30 నెంబర్లను బ్లాక్‌ చేశాను. నా తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి విసిగిస్తున్నాడు. మా వాళ్లు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేద్దాం అన్నారు. కానీ, నేను క్షమించి వదిలేశా. అయినా అతడు మారలేదు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో నన్ను పెళ్లి చేసుకోవాలనుందని అన్నాడు. అప్పటినుంచి నా పెళ్లిపై పుకార్లు మొదలుపెట్టాడు’’ అని పేర్కొన్నారు. 
 
కాగా, నిత్యా మీనన్‌ దశాబ్ధానికిపైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నా కూడా  ఆమెపై పెద్దగా పుకార్లు రాలేదు. కానీ, గత కొద్దినెలల నుంచి వరుసగా ఆమె పెళ్లి విషయంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.