మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 26 జులై 2022 (22:56 IST)

థమ్స్ అప్ హర్‌హాథ్‌ తూఫాన్ క్యాంపెయిన్‌తో ఇండియా 75వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు

Thumps Up
కోకా-కోలా ఇండియా యొక్క బిలియన్ డాలర్ స్వదేశీ బ్రాండు థమ్స్ అప్, భారతదేశం యొక్క 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవాన్ని స్మరించుకుంటూ ఒక కొత్త క్యాంపెయిన్ కి తెరలేపింది. ఈ క్యాంపెయిన్ #హర్‌హాథ్‌తూఫాన్, అనేక సంవత్సరాల పాటు భారతదేశ నిర్మాణానికి తమ స్వహస్తాలతో కృషి చేసి - మన జాతి ప్రతిష్టకు నిజమైన దీప స్థంభాలై వెలుగొందిన స్ఫూర్తిదాయకులైన వ్యక్తులను ఘనంగా శ్లాఘిస్తుంది.  ఈ క్యాంపెయిన్ ద్వారా బ్రాండు, తమ మార్గానికి అడ్డుగా నిలిచిన ఆటంకాలన్నింటినీ అధిగమించి ధైర్యసాహసాలు, మొక్కవోని పట్టుదల మరియు నిలకడైన శక్తిని చూపిన వారి ధీరోదాత్తతను సంబరంగా జరుపుకుంటుంది. ఒక బలవంతపు సందేశం మరియు సృజనాత్మక దార్శనికతతో, ప్రేక్షకులు మరియు శ్రోతలలో గాఢమైన దేశభక్తిని తట్టి లేపడానికి థమ్స్ అప్ లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ క్యాంపెయిన్ లో కథ చెప్పే శైలి ఒక శక్తివంతమైన యానిమేషన్ రూపములో ఉంటుంది, అది దేశములోని పౌరుల్లో గర్వం మరియు దేశభక్తిని ప్రేరేపిస్తుంది. 
 
#హర్‌హాథ్‌తూఫాన్ క్యాంపెయిన్, భారతీయ క్రికెట్ జట్టులో ఆత్మవిశ్వాసము మరియు నిర్భీతిని నింపి జట్టును ఉన్నత విజయ శిఖరాలకు చేర్చినటువంటి మాజీ భారత జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్ మరియు ప్రస్తుత బిసిసిఐ అధ్యక్షులు అయిన సౌరవ్ గంగూలీ; తాను 11 సంవత్సరాల వయసులో ఉండగా ఒక ప్రమాదములో తన కాళ్ళు పోగొట్టుకున్నప్పటికీ ప్రథమ స్థానానికి తన మార్గాన్ని సుగమం చేసుకుంటూ పారాలింపిక్స్‌లో ఒక బంగారు పతకం గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ అయిన అవని లేఖ్రా; మరియు సాంప్రదాయంగా పురుషులు ఆడే క్రీడగా పేర్కొనబడుతున్న ఒక క్రీడలో గొప్ప పట్టుదల మరియు పోరాట పటిమను ప్రదర్శించి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన భారతీయ బాక్సర్ మరియు ఐబిఏ మహిళల ప్రపంచ బాక్సింగ్ 2022 బంగారు పతక విజేత నిఖత్ జరీన్  వంటి క్రీడాకారుల స్ఫూరిదాయక కథలను కలిగి ఉంటుంది. బ్రాండుచే ఈ కొత్త క్యాంపెయిన్, ఒలంపిక్ మరియు పారాలింపిక్ గేమ్స్ టోక్యో 2020 తో థమ్స్ అప్ యొక్క ప్రపంచవ్యాప్త భాగస్వామ్యము సందర్భంగా గత సంవత్సరం ప్రారంభించిన తన #పలాట్‌దే గొడుగు క్రింద ఒక పొడిగింపుగా ఉంటుంది.  
 
కొత్త క్యాంపెయిన్ ని ప్రకటిస్తూ, కోకా-కోలా ఇండియా మరియు సౌత్‌వెస్ట్ ఏషియా  యొక్క స్పార్క్లింగ్ ఫ్లేవర్స్ కేటగరీ, సీనియర్ డైరెక్టర్ టిష్ కాండెనో ఇలా అన్నారు, “ఇండియా యొక్క చిహ్నాత్మక స్వదేశీ జనన బ్రాండులలో ఒకటిగా, థమ్స్ అప్ ఎల్లప్పుడూ శక్తి మరియు నియత విలువలకు ముందుభాగములో నిలిచింది. ఒలంపిక్ మరియు పారాలింపిక్ గేమ్స్ యొక్క భాగస్వామ్యముతో థమ్స్ అప్ యొక్క 2021 #పలాట్‌దే క్యాంపెయిన్, విపరీతమైన అభిమానం మరియు ప్రశంసలను పొందింది.  ఈ సంవత్సరం, థమ్స్ అప్ ఒక ప్రత్యేకమైన #పలాట్‌దే క్యాంపెయిన్ తో, భారతదేశాన్ని నిర్మిస్తూ ఉన్న అనేక హస్తాల గురించి భారతదేశం యొక్క 75 వ సంవత్సరపు ఘనమైన స్వాతంత్ర్య వేడుకల్ని జరుపుకుంటోంది.  ఇండియా నుండి అనేక సంవత్సరాల పాటు దేశం యావత్తూ గర్వపడేలా చేసిన స్ఫూర్తిదాయక వ్యక్తులైన- సౌరవ్ గంగూలీ, అవని లేఖ్రా మరియు నిఖత్ జరీన్ మరియు అటువంటి ఇతర వ్యక్తులతో భాగస్వామ్యం వహిస్తున్నందుకు మాకు ఎంతో గర్వంగా ఉంది” అన్నారు.
 
 
కొత్త క్యాంపెయిన్ గురించి మాట్లాడుతూ, మాజీ భారత జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్ మరియు ప్రస్తుత బిసిసిఐ అధ్యక్షులు అయిన సౌరవ్ గంగూలీ గారు ఇలా అన్నారు, “2017 నుండీ బ్రాండ్ అంబాసిడర్ గా కోకా-కోలా ఇండియాతో అనుబంధం కలిగి ఉండడం పట్ల నాకు ఎంతో గర్వంగా ఉంది.  ఈ రోజున, ఇండియా యొక్క 75 వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలను అందంగా కొనియాడే  థమ్స్ అప్ యొక్క కొత్త క్యాంపెయిన్  #హర్‌హాథ్‌తూఫాన్ యొక్క భాగమైనందుకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను” అన్నారు.
 
పట్టు కలిగియున్న #హర్‌హాథ్‌తూఫాన్ చిత్రం ఓజిల్వీచే భావజాలీకరణ చేయబడింది. క్యాంపెయిన్ వెనుక గల సృజనాత్మక గ్రాహ్యతపై ఓజిల్వీ ఇండియా- నార్త్, ఛీఫ్ క్రియేటివ్ అధికారి రీతూ శారద గారు వ్యాఖ్యానిస్తూ, ఇలా అన్నారు, “గత 75 సంవత్సరాల పాటు, భారతదేశం యొక్క సమర్థతను కొందరు తక్కువ చేసి జోస్యం చెప్పినప్పుడల్లా, దేశభక్తులు ముందుకు వచ్చి వాటిని తలక్రిందులు చేస్తూ #పలాట్‌దే చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. థమ్స్ అప్ దేశం యొక్క అత్యంత చిహ్నాత్మక బ్రాండులలో ఒకటిగా ఉంది మరియు తన గుర్తుగా సుప్రసిద్ధమైన ‘థంబ్స్ అప్’ చేతిని కలిగి ఉంది. కాబట్టి, ఈ 75 వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా, మేము ఈ చేతిని తూఫానీగా ఉండే అనేక చేతులుగా రూపాంతరం చేయడం పట్ల గర్వపడుతున్నాము.  మరియు అది మా క్యాంపెయిన్ #హర్‌హాథ్‌తూఫాన్ లో అందంగా కలిసి వస్తుంది.”