శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్

వంట గ్యాస్ రాయితీలో భారీగా కోత... ఇకపై భారం తప్పదా?

lpg cylinder
ప్రజలకు ఇచ్చే వంటగ్యాస్‌ నగదు రాయితీకి కేంద్రం భారీగా కోత పెట్టింది. 2019-20లో దీని కింద రూ.24,172 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం 2021-22 నాటికి ఎకాఎకి రూ.242 కోట్లకు తగ్గించిపారేసింది. కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తేలి సోమవారం రాజ్యసభలో ఇచ్చిన సమాధానం ఈ విషయాన్ని వెల్లడించింది. 
 
2019 ఏప్రిల్‌ ఒకటో తేదీన ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.706.50 ఉండగా, ఆదివారం నాటికి రూ.1,053కి (49 శాతం పెంపు) చేరింది. సిలిండర్‌ ధరలకు ఆధారమైన 'సౌదీ కాంట్రాక్ట్‌ ప్రైస్‌' ఇదే సమయంలో టన్నుకు 508 డాలర్ల నుంచి 750 డాలర్లకు (47 శాతం) పెరిగింది.
 
గత మూడేళ్లలో సబ్సిడీ తగ్గిన తీరును ఓ సారి పరిశీలిస్తే, ప్రత్యక్ష నగదు బదిలీ కింద గత 2019-20లో 22,726 కోట్లను బదిలీ చేయగా, ఇది 2020-21లో  రూ.3658 కోట్లకు, 2021-22లో రూ.242 కోట్లకు తగ్గించారు. 
 
అలాగే, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద గత 2019-20లో రూ.1446 కోట్లు, 2020-21లో రూ.76, 2021-22లో ఒక్క పైసా కూడా కేటాయించలేదు. అలాగే పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద గత 2020-21లో రూ.8162 కోట్లను కేటాయించి, 2021-22లో ఒక్క పైసా కూడా కేటాయించలేదు.