బుధవారం, 8 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 23 జులై 2022 (20:11 IST)

24-07-2022 నుంచి 30-07-2022 వరకు మీ వార రాశి ఫలితాలు

kanya rashi
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
ఈ వారం ప్రతికూలతలు అధికం. ఆచితూచి వ్యవహరించాలి. ప్రముఖులను కలిసినా ఫలితం ఉండదు. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఎదుటివారి ఆంతర్యం అవగతమవుతుంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. రుణ ఒత్తిళ్లు వేధిస్తాయి. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. గృహమార్పు ఫలితం త్వరలో కనిపిస్తుంది. వ్యాపారాభివృద్ధికి విపరీతంగా శ్రమిస్తారు. షాపు పనివారలతో జాగ్రత్త. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ఒత్తిళ్లు, ధనప్రలోభాలకు లొంగవద్దు. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. సేవ, పుణ్య కార్యాలల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
మీ మాటకు ఎదురుండదు. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపకాలు, బాధ్యతలు అధికమవుతాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. సోమ, మంగళ వారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉచండి. ఆరోగ్యం మెరుగుపుడుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకం. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. అధికారులకు స్థానచలనం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు ప్రోత్సాహకరం. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. ఆశావహదృక్పథంతో అడుగువేయండి. సలహాలు, సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. కొంతమొత్తం ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆది, సోమ వారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. నిలిపివేసిన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన ప్రధానం. పత్రాల రెన్యువల్ లో మెలకువ వహించండి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మికత పై ఆసక్తి పెంపొందుతుంది. 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
ఆర్థిక స్థితి సామాన్యం. పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. ఆకస్మిక ఖర్చులుంటాయి, ధనం మితంగా వ్యయం చేయండి. ఈ చికాకులు తాత్కాలికమే. పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దంపతుల మధ్య సఖ్యత లోపం. బుధ, గురు వారాల్లో కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. ఆత్మీయులతో కలయికతో కుదుటపడతారు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టకాలం. ఇంటర్వ్యూలు, ఉపాధి పథకాలు ఏమంత సంతృప్తినీయవు 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. ఆత్మీయుల కలయిక ఉత్తేజాన్నిస్తుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. శుక్ర, శని వారాల్లో అపరిచితులతో జాగ్రత్త. అంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. విశ్రాంతి అవసరం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలించవు. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలకు తరుణం కాదు. ప్రయాణం విరమించుకుంటారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. మీ నమ్మకం వమ్ముకాదు. ఆప్తులతో సంభాషణ ఉల్లాసం కలిగిస్తుంది. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. నోటీసులు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. పెద్దల సలహా పాటించండి. దంపతుల మధ్య దాపరికం తగదు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. బిల్డర్లు, కార్మికులకు కష్టకాలం.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2 3 పాదములు
మీ ఓర్పు, నేర్పులకు పరీక్షా సమయం. వ్యవహారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. విమర్శలు, అభియోగాలు ఎదుర్కుంటారు. కొన్ని షయాలు పట్టించుకోవద్దు. సోమ, మంగళ వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని సంఘటనలు మనస్థిమితం లేకుండా చేస్తాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపచేస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. వ్యవసాయ తోటల రంగాల వారికి ఆశాజనకం. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు 
శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఖర్చులు అదుపులో ఉండవు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. పెట్టుబడులు అనుకూలించవు. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. అపరిచితులు మోసగించేందుకు యత్నిస్తారు. ప్రలోభాలకు లొంగవద్దు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. గురు, శుక్రవారాల్లో నగదు, పత్రాలు జాగ్రత్త. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ఉపాధి పథకాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. భూ సంబంధిత వివాదాలు జటిలమువుతాయి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 123 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త, సంస్థల స్థాపనలకు అనుకూలం. గృహమార్పు కలిసివస్తుంది. శనివారం నాడు పనుల్లో శ్రమ, చికాకులు అధికం. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. నిరుద్యోగులకు శుభయోగం. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. న్యాయ, వైద్య, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
ఆచితూచి అడుగేయాలి. మీ అభిప్రాయాలకు ఏమంత స్పందన ఉండదు. అకారణంగా మాటపడవలసి వస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు, అయిన వారు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజాన్నిస్తుంది. ధనలాభం ఉంది. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఆది, సోమ వారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. గృహవాస్తు దోష నివారణ చర్యలు సత్ఫలితమిస్తాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. అధికారులకు అదనపు బాధ్యతలు. ముఖ్యలకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకం. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు 
అభీష్టం నెరవేరుతుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. గౌరవం పెంపొందుతుంది. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. ఆసక్తిరమైన విషయాలు తెలుసుకుంటారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆది, గురు వారాల్లో నగదు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం మొండితనం ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. గృహమార్పు కలిసివస్తుంది. పెట్టుబడులకు తరుణం కాదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఉపాధ్యాయులకు శుభయోగం. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకం. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు.
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
అన్ని రంగాల వారికి ఆశాజనకం. పరిచయాలు బలపడతాయి. ఆప్తులకు వివాహ సమాచారం అందిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. శుక్ర, శని వారాల్లో అనుకోని సంఘటనలెదురవుతాయి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. అధికారులకు ఒత్తిడి, పనిభారం. ఉద్యోగస్తులు మన్నలు, పురస్కారాలు అందుకుంటారు. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. కార్మికులు, చేతి వృత్తుల వారికి కొత్త పనులు లభిస్తాయి.