ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 మార్చి 2021 (19:42 IST)

సాయిపల్లవి అవుట్.. పవన్ కల్యాణ్ సతీమణిగా నిత్యామీనన్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్-రానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్‌. ఈ చిత్రంలో ఐశ్వర్యరాజేశ్ వన్ ఆఫ్ ది హీరోయిన్‌గా ఎంపికైంది. అయితే పవన్ కల్యాణ్‌కు జోడీగా నటించే హీరోయిన్‌పైనే మొదటి నుంచి సస్పెన్స్ నెలకొంది. డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో సాయిపల్లవి ఈ ప్రాజెక్టుకు నో చెప్పినట్టు ఇప్పటి వరకు టాక్‌. తాజాగా ఈ రోల్ కోసం మేకర్స్ మరో మలయాళం బ్యూటీ నిత్యమీనన్‌ను సంప్రదించారట.
 
సాయిపల్లవి తర్వాత ఆ పాత్రకు నిత్యమీనన్ అయితే సరైన న్యాయం చేస్తుందని ఫిక్స్ అయ్యారట. నిత్యామీనన్ కూడా పవన్‌కల్యాణ్ సతీమణిగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. దీనిపై అధికారిక ప్రకటన రావడం ఒక్కటే పెండింగ్‌లో ఉన్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్‌. సాగర్ చంద్ర డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టును సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.