ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 11 నవంబరు 2018 (10:23 IST)

కోర్కె తీర్చలేక ఓ స్టార్ హీరోతో సినిమా వదులుకున్నా : నిత్యా మీనన్

ఓ స్టార్ హీరోతో ఓ భారీ ప్రాజెక్టు సినిమాను వదులుకున్నట్టు మలయాళ బొద్దుగుమ్మ నిత్యా మీనన్ వెల్లడించింది. దీనికి కారణం ఆ స్టార్ హీరో గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక వదులుకున్నట్టు చెప్పుకొచ్చింది. 
 
ఇదే అంశంపై ఆమె తాజాగా మాట్లాడుతూ, తనకు ఓ హీరో నుంచి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. ఈ కారణంగానే అతనితో ఓ సినిమా వదులుకున్నట్టు చెప్పింది. అయితే, ఆ సినిమా పేరును మాత్రం ఆమె వెల్లడించలేదు. అయితే, అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు తాను సినిమాలు వదలుకోడానికి సంకోచించనని నిత్యా తెలిపారు. 
 
సినిమా అంగీకరించడానికి ముందుగానే అలాంటి విషయాల్లో జాగ్రత్తపడతానని చెప్పింది. 'ఇందుకు నేను కొన్ని పద్ధతులను పాటిస్తాను. లైంగిక వేధింపులు వంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండాలంటే మన వర్కింగ్ స్టైల్‌తోనే బలమైన మెసేజ్ ఇవ్వాలి. దీనివల్ల మనతో తప్పుగా ప్రవర్తించడం, లేదా తప్పుడు ఉద్దేశంతో అవకాశాలు ఇస్తామనడం వంటివి ఉండవు' అని ఆమె తెలిపారు.