chiranjeevi : మన శంకరవర ప్రసాద్ గారు ని ఏ శక్తి కూడా ఆపలేదు...
mesala pilla song trend setter
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకరవర ప్రసాద్ గారు దీపావళి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే మీసాల పిల్ల పాట కూడా రిలీజైంది. ఆ పాటకు ఊహించని అప్లాజ్ రావడంతో మెగాస్టార్ టీమ్ ఖుషీగా వున్నారు. దానిని వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియాలో.. అతను పరిపాలించాలని నిర్ణయించుకున్నప్పుడు ...ఏ శక్తి కూడా అతన్ని ఆపలేదు.. అంటూ మీసాల పిల్ల పాటకు వచ్చిన రెస్పాన్ ను తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేశారు.
ఫస్ట్ సింగిల్.. మీసాల పిల్ల ఇప్పటికే సూపర్ హిట్‌గా దూసుకెళ్తోంది. రికార్డ్ వ్యూస్ సాధించిన ఈ మెలోడియస్ సాంగ్ ప్రస్తుతం అన్ని మ్యూజిక్ ప్లాట్‌ఫార్మ్స్‌లో ట్రెండింగ్‌లోనే ఉంది. చిరంజీవి గ్రేస్, స్వాగ్‌ను అద్భుతంగా చూపించిన ఈ పాట విడుదలతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
ఆ పాటలకు 30 మిలియన్ ప్లస్ వ్యూస్ రాగా, 30 కె ప్లస్ లో రీల్స్ వచ్చాయి. 300 మిలియన్ ప్లస్ రీల్ వ్యూస్ చూశారు. ఆల్ మ్యూజిక్ ప్లాట్ ఫారమ్ లో 50 మిలియన్ పైగా ప్లేస్ వచ్చాయి. దీనిని సగర్వంగా ప్రకటిస్తున్నట్లు మెగాస్టార్ టీమ్ ప్రకటించింది. చిరంజీవి, నయన తారపై తీసిన ఆ పాటకు శంకర్ మహదేవన్ పాటను ఆలపించారు. ఆయన గతంలో చిరంజీవి సినిమాకు పాడిన వాయిస్ ఈసారి సరికొత్తగా అనిపించింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చారు.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2026 సంక్రాంతికి బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ లో ఒకటి. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు.