ప్రభాస్ ప్లేస్‌లో ఎన్.టి.ఆర్. వచ్చాడు ఎలాగంటే!
సినిమాకు ఒక హీరోను అనుకుంటే షడెన్‌గా మరొకరు చేరతాడు. హీరోయిన్లుగా అంతే. ఫ్లాష్‌బ్యాక్‌లో చూస్తే జమున చేయాల్సిన పాత్ర తెల్లారిషూట్‌లోకి వెళ్ళేసరికి మరొకరు వచ్చేవారు. అలాగే విజయశాంతి కూడా. ఇవన్నీ ఆమధ్య వారు తమ మనసులోని మాటలను వెల్లడించినవే. ఇప్పుడు తాజాగా హీరోల గురించి వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీదత్ చెప్పినమాట. ఆయన తీసిన సీతారామం ఊహించని క్లాసిక్ సినిమాగా నడుస్తోంది. థియేటర్లకు జనాలను రప్పించే పని చేస్తుంది కూడా.
ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా పెద్ద టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మనసులోని కొన్ని మాటలు వెల్లడించాడు. అప్పట్లో స్టూడెంట్ నెం:1 సినిమాకు హీరోగా ముందుగా ప్రభాస్‌ను అనుకున్నాం. అంతా ఫిక్స్ అయి కబురు చెప్పేలోపలే దివంగల హరికృష్ణగారు తనకు ఫోన్ చేసి జూనియర్ ఎన్టీఆర్‌ని ఎంపిక చేయమని అడిగారు. దాంతో ఎన్.టి.ఆర్. ముందుకు రావాల్సివచ్చింది. ఇలా తెరవెనుక కథలు చాలానేవుంటాయి. కానీ అవి వెంటనే చెప్పరు. కొన్నాళ్ళకు కాని బయటకు రావు. ఎంత టాలెంట్ వున్నా బయటపెట్టాలంటే బ్యాక్‌బోన్ వుండాల్సిందేమరి. ఇక అశ్వనీదత్ చెప్పిన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఆగస్టు 15న ఈటీవీలో చూసి తెలుసుకోవాల్సిందే.