గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Dee Vee
Last Updated : గురువారం, 21 ఫిబ్రవరి 2019 (20:59 IST)

నాదెండ్ల భాస్కర్ విలన్.. చంద్రబాబు స్వాతిముత్యం... ఇదే 'మహానాయకుడు' ఓవర్సీస్ రివ్యూ రిపోర్ట్

స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర రెండు భాగాలుగా వెండితెర దృశ్యకావ్యంగా తెరకెక్కింది. ఇందులో తొలి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు గత సంక్రాంతికి విడుదలై నందమూరి అభిమానులతో పాటు.. సినీ అభిమానులను తీవ్ర నిరాశపరిచింది. ఇపుడు ఈనెల 22వ తేదీ శుక్రవారం ఎన్.టి.ఆర్. మహానాయకుడు చిత్రం విడుదల కానుంది. 
 
అయితే, ఈ చిత్రం ఓవర్సీస్‌లో మాత్రం గురువారమే విడుదలైంది. దీంతో సోషల్ మీడియాలో కొందరు ఈ చిత్రం రివ్యూ రిపోర్టులు రాస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో ప్రధానంగా విలన్‌గా నాటి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావును చూపించారట. అలాగే, ఎన్టీఆర్ అల్లుడైన టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మాత్రం చాలా మంచోడుగా చూపించినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
అయితే, ఈ చిత్రంలో తనను విలన్‌గా చూపిస్తే మాత్రం తాను కోర్టుకెక్కనున్నట్టు నాదెండ్ల భాస్కర్ రావు ఇప్పటికే ప్రకటించారు. కానీ, ఈ చిత్రంలో ఆయన్నే ప్రధాన విలన్‌గా చూపించారట. కాగా, ఈ చిత్రానికి క్రిష్ జాగర్ల మూడి దర్శకత్వం వహించగా, విద్యాబాలన్, చంద్రబాబు పాత్రలో దగ్గుబాటి రానా తదితరులు నటించారు.