శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 27 నవంబరు 2018 (14:06 IST)

వ‌ర్మ నిర్ణ‌యంతో షాక్‌లో ల‌క్ష్మీపార్వ‌తి... ఏమైంది?

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ టైటిల్‌తో సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి లక్ష్మీ పార్వతి అతిథిగా కూడా పాల్గొనడం తెలిసిందే. ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ జీవితంలో జ‌రిగిన కొన్ని ముఖ్య సంఘ‌ట‌నలను చూపించనున్నానని వ‌ర్మ‌ ప్రకటించారు. 
 
ఈ సినిమా తీసేందుకు వ‌ర్మ‌కు లక్ష్మీ పార్వతి నుంచి అనుమతి తీసుకోవడమే కాకుండా, మొత్తం స్క్రిప్ట్‌ను ఆమెకు చదివి వినిపిస్తానని మాట ఇచ్చారు కూడా. అయితే... ఇంతలోనే వ‌ర్మ‌ మనసు మార్చకున్నాడ‌ట‌. ఆ స్క్రిప్ట్‌ను ఎవరికీ వినిపించాల్సిన అవసరం లేద‌ంటున్నాడు. దీంతో స్ర్కిప్ట్ వినిపిస్తాడ‌ని ఎదురుచూసిన‌ లక్ష్మీ పార్వతి షాక్ అయ్యింద‌ట‌. ఈ క‌థ‌కు కొత్త‌వాళ్లు అవ‌స‌రం. ఎలాంటి ఇమేజ్ ఉండ‌కూడదు. అందుచేత కొత్త‌వాళ్లుతోనే తెర‌కెక్కిస్తున్నాను అని చెప్పారు. మ‌రి.. ల‌క్ష్మీ పార్వ‌తిని ఇందులో ఎలా చూపిస్తాడో ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.