గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 10 ఆగస్టు 2022 (14:44 IST)

సెప్టెంబర్ 16న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

Sudheer Babu, Kriti Shetty
Sudheer Babu, Kriti Shetty
సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో విలక్షణమైన ప్రేమకథగా వస్తున్న చిత్రం''ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ అవుతుంది. నిర్మాతలు దీనికి సంబధించిన అధికారిక ప్రకటన చేశారు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
 
సుధీర్ బాబుకు జోడిగా కృతిశెట్టి కథానాయికగా కనిపించనుంది. నిర్మాతలు బి మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి బెంచ్‌మార్క్ స్టూడియోస్‌పై మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గాజులపల్లె సుధీర్ బాబు చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
 
ఇంద్రగంటి గత సినిమాల్లాగే 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'లో కూడా సంగీతానికి మంచి ప్రాధాన్యత వుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ కొత్త కొత్త గా పాట ప్లజంట్ కంపోజిషన్ తో ఆకట్టుకున్నారు వివేక్ సాగర్. ఆల్బమ్‌లోని మిగతా పాటలు కూడా సంగీత ప్రియులను ఆకట్టుకోబోతున్నాయి.