శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 11 ఏప్రియల్ 2022 (13:11 IST)

25 ఏళ్లు పైబడిన వారు మాత్ర‌మే విస్కీ తాగండి - ప్రగ్యా జైశ్వాల్

Pragya Jaishwal, Bourbon Whiskey
Pragya Jaishwal, Bourbon Whiskey
సిగ‌రెట్‌, మందు తాగ‌డం ఆరోగ్యానికి హానిక‌రం అని ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చినా ప్ర‌జ‌లు అవ‌న్నీ మ‌ర్చిపోయి త‌మ మాన‌సిక ఆనందం కోసం తాగుతుంటారు. ఇప్పుడు ఆకోవ‌లో మ‌హిళ‌లు కూడా ఎక్కువ‌య్యారు. పాత్యాశ్చ క‌ల్చ‌ర్ బాగా భార‌త్‌లో పేరుకుపోయింది. బాలీవుడ్‌లో మ‌రింత ఎక్కువ‌యింది. షూటింగ్‌లు రాత్రిళ్ళు ఎక్కువ‌గా జ‌ర‌గ‌డం, పార్టీలు జ‌రుపుకోవ‌డం మామూలే. శ్రీ‌దేవి నుంచి ప్ర‌తివారూ మందు కొట్టేవారే. కానీ అప్ప‌టి హీరోయిన్లు ఎక్క‌డా మందు గురించిన వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లో పాల్గొన‌లేదు. కానీ ఇప్ప‌టి త‌రం హీరోయిన్లు మందు తాగండి, కొద్దిగా తాగండి అంటూ నీతులు చెబుతున్నారు. ఇంత‌కుముందు లక్ష్మీరాయ్, హన్సిక, రాధికా ఆప్టే, పాయల్ రాజ్ పుత్, ఇలియానా, కాజల్.. ఇలా చాలామంది లిక్కర్ బ్రాండ్స్ ప్రమోట్ చేశారు. ఇప్పుడు కొత్త‌గా ప్రగ్యా జైశ్వాల్ చేరింది. 
 
మ‌త్తుక‌ళ్ళ‌తో \క‌వ్వింపుగా క‌నిపించే ప్రగ్యా జైశ్వాల్ తెలుగులో న‌టించినా పెద్ద‌గా హిట్ కాలేదు. తాజాగా అఖండ ఇచ్చిన ఉత్సాహంతో ఆమెకు పాపుల‌ర్ బాగా వ‌చ్చేసింది. అందుకే మందు తాగండి అంటూ ఓ వ్యాపార ప్ర‌క‌ట‌న‌లో  చేసింది.  ప్రపంచ నంబర్ 1 బోర్బన్  ప్రేమిస్తున్నాను. అంటూ బోర్డ‌న్ విస్కీ బాటిల్ ప‌క్క‌న పెట్టుకుని త‌న సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసింది. దానితోపాటు నీతులు కూడా చెప్పింది.  దీన్ని  బాధ్యతాయుతంగా త్రాగండి- ఈ కంటెంట్ 25 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే అంటూ తెలిపింది. ఇప్ప‌టికే ఈ విష‌యం ట్రోలింగ్ అవుతోంది.

అందుకు త‌గిన‌విధంగా విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి._ఉదయ్_కిరణ్ అనే ఫాలోవ‌ర్  మద్యాన్ని ఆమోదించడం ద్వారా మీరు యువతకు ఏమి సందేశం ఇస్తున్నారు అంటూ సీరియస్ గా ప్ర‌శ్నించారు. అదేవిధంగా మ‌రికొంద‌రు ఫైర్ అయ్యారు కూడా. కానీ వారికి ఏమీ స‌మాధానం చెప్ప‌లేదు. ఇప్ప‌టికే ఓటీటీ సినిమాల‌పేరుతో వ‌స్తున్న చాలా సినిమాల్లో హీరోయిన్లు మందు కొట్ట‌డం అనేది కామ‌న్‌గా చూపిస్తున్నారు. మ‌ద్యం తాగ‌డం గొప్ప‌గా ఫీల‌య్యే రోజులు వ‌చ్చేశాయి.