సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 22 జనవరి 2019 (10:58 IST)

స్టార్ ''మా''లో పవన్ కల్యాణ్ 'తొలిప్రేమ'

పవన్ కల్యాణ్ ''తొలిప్రేమ'' మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. 1998లో విడుదలైన ఈ పవన్ తొలి సినిమా హక్కులను మా సొంతం చేసుకుంది. పవన్ పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రంగా ఇది తెరకెక్కింది. దర్శకుడు కరుణాకరన్ ఓ ఫ్రెష్ లవ్ స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే మా ఈ సినిమా రైట్స్‌ను సొంతం చేసుకుంది. త్వరలోనే ఈ సినిమాను స్టార్ మాలో ప్రదర్శించబోతున్నారట. 
 
ఈ చిత్రంలో పవన్‌కు జోడిగా కీర్తి రెడ్డి నటించింది. దేవా సంగీతం అందించిన ఈ సినిమాకు జాతీయ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వాసుకి, అలీ, వేణుమాధవ్, నగేష్, సంగీత తదితరులు నటించారు. జీవీజీ రాజు నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.