సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 6 ఏప్రియల్ 2023 (10:33 IST)

పవన్ కళ్యాణ్ఈ సారి ఉస్తాద్ భగత్ సింగ్ తో ఊచకోతే

Pawan Kalyan usthad set
Pawan Kalyan usthad set
'ఉస్తాద్ భగత్ సింగ్' సెట్ లో  పవన్ కళ్యాణ్ నిన్న అడుగు పెట్టారు.  హైదరాబాద్ శివారులో పోలీస్ స్టేషన్ సెట్ లో బుధవారం ప్రారంభమైన షూటింగ్ లో  మొదటి షెడ్యుల్ లో పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది.  'గబ్బర్ సింగ్' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తరువాత పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ ద్వయం 'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం రెండోసారి సినిమా చేస్తున్నారు. 

మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది.
 
కాగా, ఈసారి ఎంటర్ టైన్మెంట్ కాదు. ఉస్తాద్ భగత్ సింగ్ తో ఊచకోతే అంటూ కాప్షన్ జోడించి  డైరెక్టర్ హరీష్ శంకర్ పోలీస్ స్టేషన్ సెట్ లో పవన్ కళ్యాణ్ కుర్చీ లో కూర్చున్న పోస్టర్ విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ లో బిజీగా ఉండటంతో కథ కూడా ఆ దిశగా ఉంటుందని తెలుస్తోంది.