శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 మార్చి 2021 (17:00 IST)

వకీల్ సాబ్ నుంచి తాజా అప్డేట్.. 'సత్యమేవ జయతే' లిరికల్ వచ్చేస్తోంది..!

బాలీవుడ్‌లో హిట్టయిన పింక్ చిత్రాన్ని తెలుగులో 'వకీల్ సాబ్'గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'పింక్'లో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను 'వకీల్ సాబ్'లో పవన్ కల్యాణ్ పోషిస్తుండడంతో సినిమాకు భారీ హైప్ వచ్చింది. 
 
కాగా, ఈ చిత్రబృందం నుంచి తాజా అప్ డేట్ వచ్చింది. బుధవారం సాయంత్రం 5 గంటలకు 'వకీల్ సాబ్' సినిమాలోని 'సత్యమేవ జయతే' అనే పాట లిరికల్ వీడియో రిలీజ్ చేయనున్నారు.
 
శ్రీరామ్ వేణు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రుతిహాసన్ కథానాయిక కాగా, కీలకపాత్రల్లో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.