శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: బుధవారం, 19 ఆగస్టు 2020 (21:59 IST)

ఎస్పీ బాలు కోసం సినీరంగం తరలుతోంది, ఏం చేస్తున్నారంటే?

ఈ నెల 5వ తేదీ కరోనాతో ఎంజిఎం ఆసుపత్రిలో చేరారు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం. మొదట్లో ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నా ఆ తరువాత క్రమేపీ క్షిణించింది. బాలసుబ్రమణ్యం త్వరగా కోలుకోవాలంటూ కోట్లాదిమంది అభిమానులు దేవుళ్ళను ప్రార్థించారు. ప్రార్థిస్తూనే ఉన్నారు.
 
అయితే సినీదిగ్గజాలు మొత్తం ఒకటవుతున్నారు. ఒకే వేదిక నుంచి ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్థనలు చేయనున్నారు. చెన్నై వేదికగా రేపు సాయంత్రం ఒక కార్యక్రమం జరుగబోతోంది. కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఉండే ప్రార్థనలు సరిగ్గా ఆరు గంటలకు ప్రారంభమై 6.05కు ముగుస్తుంది.
 
ఈ ప్రార్థనల్లో భారతీరాజా, కమల్ హాసన్, రజినీకాంత్, ఇళయరాజా, ఎ.ఆర్.రెహమాన్‌లు పాల్గొననున్నారు. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంగీత ప్రేమికులు, సినీ అభిమానులు ఇంటి నుంచే ఆ సమయంలో ప్రార్థనలు చేయాలని సినీ దిగ్గజాలు పిలుపునిచ్చాయి.