శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 ఫిబ్రవరి 2023 (16:25 IST)

అరబిక్ కుత్తుకు ఏడాది... డ్యాన్స్ అదరగొట్టిన పూజా హెగ్డే

Pooja Hegde
దక్షిణాది స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఇటీవలే తన పాపులర్ సాంగ్ #అరబిక్ కుత్తు ఒక సంవత్సరం వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ పాట సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ  సాంగ్ వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో మిలియన్ల వీక్షణలను సంపాదించింది. 
 
తాజాగా బీస్ట్ అరబిక్ కుత్తు వార్షికోత్సవ వేడుకలో "బీస్ట్" చిత్రంలో భాగమైన అరిబిక్ పాటకు రిహార్సల్ చేస్తున్నట్లు కనిపించింది. పూజా హెగ్డేతో పాటు ఆమె బృందం రిహార్సల్ చేస్తున్నట్లు గల వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 
 
ఇందులో పూజా హెగ్డే డ్రెస్ అదిరింది. ఆమె డ్యాన్స్ మూవ్‌లు మంత్రముగ్దులను చేస్తాయి. ఈ సందర్భంగా ArabicKuthu ఇంత పెద్ద విజయాన్ని సాధించినందుకు ఆమె వారికి కృతజ్ఞతలు తెలిపింది.