మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 27 జులై 2021 (16:02 IST)

పెళ్లి పీట‌ల‌పై పూర్ణ

purna
న‌టి పూర్ణ పెండ్లిపందిట్లోకి ప్ర‌వేశించింది. పెళ్లికూతురిగా ముస్తాబ‌యి కూర్చున్న ఆమె ఫొటో విడుద‌ల‌యింది. ఇది కేవ‌లం సినిమా కోస‌మే. ఆ సినిమా పేరు `సుంద‌రి`. రిజ్వాన్ ఎంట‌ర్టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం విడుద‌ల‌కి సిద్ద‌మైంది. హీరోయిన్ పూర్ణ లీడ్ రోల్‏లో నటిస్తున్న 'సుంద‌రి`. అర్జున్ అంబాటి నాయ‌కుడు. ఈ సినిమా ఆగ‌స్ట్‌13న థియేట‌ర్స్‌లో గ్రాండ్‌గా విడుద‌ల‌కానుంది.  
 
ఈ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్లో న‌వ‌గ్ర‌హ కుండ‌లి ముందు పూర్ణ ఇంటెన్స్ లుక్ లో క‌నిపిస్తోంది. `నాట‌కం` ఫేమ్ క‌ళ్యాణ్ జీ గోగ‌న డైరెక్ష‌న్‏లో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇప్ప‌టికే విడుదలైన ఈ మూవీ ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఫ్యామిలీడ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రానికి రిజ్వాన్ నిర్మాత‌, `ది ఆల్టిమేట్ డిసిష‌న్ ఆఫ్ ఎన్ ఇన్నోసెంట్ లేడీ` అనేది ట్యాగ్‌లైన్‌. సురేష్ బొబ్బ‌లి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బాల్‌రెడ్డి కెమెరామేన్‌, మ‌ణికాంత్ ఎడిట‌ర్.