మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 16 నవంబరు 2017 (14:49 IST)

వీపు మీద బాహుబలి పచ్చబొట్టు (ఫోటో)

బాహుబలి సినిమా ద్వారా ప్రభాస్ ప్రపంచ వ్యాప్తంగా అన్నీ రంగాల ప్రేక్షకులకు చేరువయ్యాడు. బాహుబలి, బాహుబలి 2లో నటించిన ప్రభాస్, అనుష్క త్వరలో వివాహం చేసుకోనున్నారని టాక్ వస్తోంది. తాము స్నేహితులమేనని.. తమ

బాహుబలి సినిమా ద్వారా ప్రభాస్ ప్రపంచ వ్యాప్తంగా అన్నీ రంగాల ప్రేక్షకులకు చేరువయ్యాడు. బాహుబలి, బాహుబలి 2లో నటించిన ప్రభాస్, అనుష్క త్వరలో వివాహం చేసుకోనున్నారని టాక్ వస్తోంది.

తాము స్నేహితులమేనని.. తమ మధ్య ప్రేమాయణం నడవట్లేదని ప్రభాస్-అనుష్క చెప్పినా.. వీరిద్దరి వివాహంపై సోషల్ మీడియాలో మీమ్స్, వార్తలు ఏమాత్రం ఆగట్లేదు. 
 
తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కిన బాహుబలి సినిమాతో ప్రభాస్‌కు ఫ్యాన్స్ సంఖ్య బాగా పెరిగిపోయింది. బాహుబలికి తర్వాత ప్రభాస్‌కు ఆరువేల అమ్మాయిలు పెళ్లి ప్రపోజల్ పెట్టినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ప్రభాస్ వీరాభిమాని.. బాహుబలిలోని ప్రభాస్ ముఖాన్ని తన వీపున చిత్రీకరించుకుంది. అదీ పచ్చబొట్టేసుకుంది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.