గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 అక్టోబరు 2023 (15:40 IST)

ఛత్రపతి సినిమా రీ-రిలీజ్.. ఎప్పుడో తెలుసా?

Prabhas
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన ఛత్రపతి సినిమా రీ-రిలీజ్ కానుంది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ఛత్రపతి. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు తల్లి సెంటిమెంట్‌ను ఈ సినిమాలో చూపించాడు రాజమౌళి.
 
ప్రస్తుతం ఈ సినిమాను ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 23వ తేదీన రీ రిలీజ్ చేస్తున్నారు. 4కే వెర్షన్‌లో ఈ సినిమా రీ రిలీజ్ అవుతుంది.
 
ప్రభాస్ కెరీర్ పరంగా చూస్తే ప్రస్తుతం సలార్ సినిమా చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
దీనితో పాటు కల్కి 2898 ఏడీ సినిమా ఇంటర్నేషనల్‌లో లెవల్‌లో రూపుదిద్దుకుంటుంది. అలాగే సందీప్ వంగాతో ఒక సినిమా అలానే మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నాడు ప్రభాస్. మొత్తానికి ప్రభాస్ సినిమాలతో ఫుల్ బిజీగా వున్నాడు. ఇక తన పుట్టిన రోజును యూరప్‌లో తన ఫ్యామిలీతో జరుపుకోనున్నాడు.