శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 ఆగస్టు 2021 (09:56 IST)

మా అబ్బాయి కోసం మళ్లీ పెళ్లి చేసుకున్నాం : ప్రకాష్ రాజ్

సౌత్ సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడుగా ఉన్న ప్రకాష్ రాజ్ మరోమారు పెళ్లి చేసుకున్నారు. అయితే, ఈ పెళ్లిని ఆయన తన కుమారుడు కోసం చేసుకున్నట్టు చెపుతున్నారు. తన భార్య పోనీ వర్మను మళ్లీ పెళ్లి చేసుకున్నట్టు చెప్పారు. 
 
ప్రకాష్ రాజ్‌కు గతంలో సినీ నటి డిస్కోశాంతి సోదరి లలిత కుమారితో వివాహం జరిగింది. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆ తర్వాత 2009లో ఆమెకు విడాకులిచ్చారు. ఆ మరుసటి ఏడాదే బాలీవుడ్ కొరియోగ్రాఫర్ పోనీవర్మను ప్రకాశ్ రాజ్ రెండో వివాహం చేసుకున్నారు. వీరికి వేదాంత్ అనే కుమారుడు ఉన్నారు. 
 
ఆగస్టు ఆగస్టు 24వ తేదీన వారి పెళ్లి రోజు. దీంతో ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా స్పందించారు. "ఇవాళ మేం మళ్లీ పెళ్లి చేసుకున్నాం. అందుకు కారణం మా అబ్బాయి వేదాంత్. మా పెళ్లి చూడాలని వాడు పట్టుబట్టడంతో మరోసారి ఒక్కటయ్యాం. కుటుంబంతో గడిపే క్షణాలు ఎప్పుడూ అమితానందాన్నిస్తాయి" అంటూ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా ప్రకాశ్ రాజ్ పంచుకున్నారు.
 
ఈ వేడుకల్లో ప్రకాశ్ రాజ్ కుమార్తెలు కూడా పాల్గొన్నారు. ప్రకాశ్ రాజ్‌కు మొదటి భార్య లలితకుమారి ద్వారా ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలిగారు. అయితే కుమారుడు అనారోగ్యంతో మృతి చెందాడు.