గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 6 జనవరి 2019 (17:26 IST)

లోక్‌సభ ఎన్నికల బరిలో నటుడు ప్రకాష్ రాజ్

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సినీ నటుడు ప్రకాష్ రాజ్ పోటీ చేయనున్నారు. ఆయన పోటీపై ఓ క్లారిటీ వచ్చింది. కానీ ఎక్కడి నుండి పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠ ఉండేది. అది కూడా వీడిపోయింది. ప్రకాష్... బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. 
 
ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ స్వయంగా వెల్లడించారు. ఈ నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పీసీ మోహన్ విజయం సాధించారు. గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పిస్తున్న ప్రకాశ్... మరింత దూకుడును ప్రదర్శిస్తున్నారు. 
 
ఇతని పొలిటికల్ ఎంట్రీపై పలు రాజకీయ పార్టీలు కూడా స్పందించాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ప్రకటించింది. తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆహ్వానం పలికారు. ఈ నేపథ్యంలో ఆయన జేడీయూ - కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.