శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 మే 2021 (16:48 IST)

బాపుబొమ్మ‌కు నితిన్‌తో డుం డుం డుం.. ఇన్‌స్టాలో ఫోటోలు వైరల్

Pranitha Subash
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో బాపుగారి బొమ్మో అంటూ పాట పాడుకున్న నటి ప్రణీత సుభాష్ పెళ్లి చేసుకుంది. నితిన్ రాజ్ అనే వ్యాపారవేత్తను ప్రేమించి వివాహం చేసుకుంది. టాలీవుడ్‌లో త‌న‌కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ప్రణీత  'ఏం పిల్లో.. ఏం పిల్లడో' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రణీత.. ఆ తర్వాత 'బావ', 'అత్తారింటికి దారేది', 'పాండవులు పాండవులు తుమ్మెద', 'రభస' వంటి చిత్రాలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 
 
బాపుబొమ్మ‌గా అంద‌రి మ‌దిలో చెద‌ర‌ని ముద్ర వేసిన ఈ అమ్మ‌డు ఆదివారం నితిన్ రాజ్ అనే బిజినెస్ మెన్‌ని వివాహం చేసుకుంది. క‌రోనా కార‌ణంగా బెంగ‌ళూరులోని ఆమె నివాసంలో అతి కొద్ది మంది స‌మ‌క్షంలో ఈ పెళ్లి వేడుక జ‌రిగింది. చాలా రోజులుగా నితిన్ రాజ్‌తో ప్రేమలో ఉన్న ప్రణీత.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. వివాహానికి హాజరైన ఓ స్నేహితుడు పెళ్లి ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది.
 
తాము ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నామని తెలిపింది. నితిన్‌ను తనకు బాగా తెలుసునని తెలిపింది. కరోనా కారణంగా అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు అని' ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది అమ్మ‌డు. ప్ర‌స్తుతం ప్ర‌ణిత పెళ్లి ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.