బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 22 ఆగస్టు 2017 (17:50 IST)

గర్వంగా ఫీలవుతున్నా : 'సైరా' పై ఎస్ఎస్ రాజమౌళి (Video)

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్ర "సైరా నరసింహా రెడ్డి". మంగళవారం చిరంజీవి 62వ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి పాల్గొన

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్ర "సైరా నరసింహా రెడ్డి". మంగళవారం చిరంజీవి 62వ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి పాల్గొని ఈ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందుకు గాను రాజమౌళి బాగా సంతోషపడుతూ కొద్దిసేపటి క్రితం తన ట్విట్టర్ ద్వారా ఓ ట్వీట్ పెట్టాడు.
 
'సైరా నరసింహారెడ్డి మోషన్‌ పోస్టర్ విడుదల కార్యక్రమంలో నేను పాలుపంచుకున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను, చిత్రయూనిట్‌తో పాటు నటీనటులు అత్యద్భుతంగా ఉన్నారు. యూనిట్ మొత్తానికి అభినందనలు' అని పేర్కొంటూ ట్వీట్ పోస్ట్ చేసి దానితో పాటు 'సైరా నరసింహారెడ్డి' మోషన్‌పోస్టర్ కూడా జతచేశాడు. ఈ ట్వీట్ కొద్దిసేపటికే ట్రెండింగ్ అయింది.