మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (12:23 IST)

చిత్తి-2 మెగా సీరియల్ నుంచి తప్పుకుంటున్నా- రాధికా సంచలనం

Radhika
చిత్తి-2 (తెలుగులో పిన్ని-2) నుంచి తప్పుకుంటున్నట్లు సీనియర్ నటి రాధిక సంచలన ప్రకటన చేశారు. ''ఒకవైపు సంతోషంగా ఉంది. మరోవైపు బాధగా ఉంది. అన్ని రకాల ఎమోషన్స్ కలిసి వస్తున్నాయి. సన్ టీవీ వారితో నేను ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నా. ఎంతో కష్టపడ్డాను. నా టెక్నీషియన్స్, సహనటులకు బై చెప్పాలంటే బాధగా ఉంది. ఈ సీరియల్ మాత్రం ఇలాగే ముందుకు తీసుకెళ్లండి. నా ఫ్యాన్స్, శ్రేయోభిలాషులకు అందరికీ లవ్యూ. మీరు కురిపించిన ప్రేమ, విధేయతకు ధన్యవాదాలు. చిట్టి 2 సీరియల్‌ను ఇలానే ఆదరిస్తూ ఉండండి.'' అని రాధిక ట్వీట్ చేశారు.
 
కాగా.. తెలుగు సీరియల్ పిన్ని ఎన్నో సంచనాలు సృష్టించింది. ఆ సీరియల్ సూపర్ డూపర్ హిట్టయింది. అంతగా హిట్టయింది కనుకే దానికి సీక్వెల్‌ను తీసుకొచ్చారు రాధిక. లాక్‌డౌన్ సమయంలో రాధిక చిత్తి సీరియల్‌కు సీక్వెల్ ప్రారంభించారు. అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక షూటింగ్ పనులు చకచకా జరిగాయి. ఐతే మధ్యలో కొందరు నటులు, చిత్ర యూనిట్ సభ్యులకు కరోనా వచ్చినా సీరియల్‌కు బ్రేకులు పడలేదు. నటీనటులను మార్చుతూ విజయవంతంగా సీరియల్‌ను ముందుకు తీసుకెళ్లారు. కానీ కొన్ని రోజుల తర్వాత సీరియల్ టైమ్ మార్చడంతో కొంత గందరగోళం తలెత్తింది.
 
మొదట రాత్రి 7:30 గంటలకు పిన్ని 2 సీరియల్‌ను ప్రసారం చేశారు. ఆ తర్వాత సీరియల్ ప్రేక్షకులకు దగ్గరవుతున్న క్రమంలోనే టైమ్ స్లాట్ మార్చేశారు. ఇప్పుడు రాత్రి పది గంటలకు ప్రసారం చేస్తున్నారు. టైమ్ స్లాట్ విషయంలో సన్ టీవీ యాజమాన్యంతో రాధికకు మనస్పర్థలు వచ్చాయని.. ఈ క్రమంలోనే ఆమె తప్పుకున్నాని ప్రచారం జరుగుతోంది. 
 
అలాంటివేమీ లేవని తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాధిక పోటీ చేయబోతున్నారని.. రాజకీయంగా బిజీగా కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె సన్నిహితులు చెప్తున్నారు. ఏదేమైనా పిన్ని 2 నుంచి రాధిక తప్పుకోవడం ఆ సీరియల్ అభిమానులకు నిజంగా షాకింగ్ న్యూస్. ఇకపోతే.. రాధిక.. వెండితెరపై ఎన్నో అద్భుతాలు సృష్టించింది. తెలుగు, తమిళ్, మలయాళంలో కలిసి 350కి పైగా చిత్రాల్లో నటించారు. 
 
అగ్రహీరోలందరి సరసన హీరోయిన్‌గా మెరిశారు. తన అందం, అభినయంతో అందరినీ అలరించారు. ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. 58 ఏళ్ల వయసున్న ఈ మహానటి ఇప్పటి వెండి తెరపై సందడి చేస్తున్నారు. 
 
అంతేకాదు బుల్లితెరపైనా తనదైన ముద్రవేశారు రాధిక. పిన్ని, రాణి వాణి వంటి సీరియల్స్‌తో అందరి ఇళ్లలో కుటుంబ సభ్యుడిగా మారిపోయారు. ఆ సీరియల్స్ ద్వారా కొన్నేళ్లుగా అందరికీ వినోదం పంచుతున్నారు. ఐతే సీరియల్స్ విషయంలో నటి రాధిక సంచలన నిర్ణయం తీసుకున్నారు.