సంపూకు లైఫ్ ఇచ్చిన జక్కన్న.. ఆ ట్వీట్ మార్చేసింది..  
                                       
                  
				  				  
				   
                  				  హృదయ కాలేయం సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి అనూహ్యంగా హీరోగా పేరు దక్కించుకున్న సంపూర్ణేష్ బాబు తనకు వచ్చిన మొత్తంలో  సాయం చేస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పుడు ఒక మంచి గుర్తింపు ఉన్న హీరోగా.. నటుడిగా నిలిచిన సంపూర్ణేష్ బాబు ఒకప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడో అందరికి తెల్సిందే. ఆయన భార్య ఇప్పటికి కూడా ఒక కుట్టు మిషన్‌ను రన్ చేసుకుంటూ ఉంటారు. 
				  											
																													
									  
	 
	అలాంటి సంపూర్ణేష్ బాబు ఇప్పుడు టాలీవుడ్‌లో గుర్తింపు ఉన్న నటుడు అవ్వడానికి నూటికి నూరు శాతం జక్కన్న రాజమౌళి కారణం. ఔను టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఒకే ఒక్క ట్వీట్ ఇప్పుడు సంపూర్ణేష్ బాబును జనాల్లో నిలిచేలా చేసింది. స్టివెన్ శంకర్ ఒక ప్రయోగాత్మకంగా కొన్ని లక్షలతో తెరకెక్కించిన హృదయ కాలేయం అనే సినిమాను చూడకుండానే వారి యొక్క ఉత్సాహం మరియు వారి  ఫ్యాషన్‌ను చూసిన రాజమౌళి సంపూర్ణేష్ బాబు పోస్టర్‌ను ట్వీట్ చేశాడు.
				  
	 
	అంతే ఒక్కసారిగా సంపూర్ణేష్ బాబు గురించి చర్చించుకోవడం మొదలు అయ్యింది. దాదాపుగా పదేళ్ల క్రితం రాజమౌళి క్రేజ్ ఇప్పటంత లేదు. అయినా కూడా సంపూర్ణేష్ బాబును ఆయన ట్వీట్ చేయడం.. ఆ సమయంలోనే సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో చాలా చర్చ జరగడంతో అనూహ్యంగా హృదయ కాలేయం సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అలా సంపూర్ణేష్ బాబు కూడా బాగా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.