గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2019 (10:10 IST)

ముదురు హీరోల కంటే యంగ్‌స్టర్లే ఇష్టం.. రకుల్ ప్రీత్ సింగ్

టాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ అమ్మడు ఖాతాలో సరైన హిట్స్ లేకపోయినప్పటికీ... వరుస ఆఫర్లు మాత్రం వరిస్తున్నాయి. ఫలితంగా తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతూ, మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే, ఈ అమ్మడుకు ముదురు హీరోల కంటే యంగ్‌స్టర్ హీరోలంటే అమితమైన ఇష్టమట. 
 
ఇదే అంశంపై నటి మంచు లక్ష్మి 'ఫీట్ అప్ విత్ స్టార్స్' ప్రోగ్రామ్‌లో వెల్లడించింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన రకుల్ వంటి భామలు సాధారణంగా ఇష్టమైన హీరో అంటే ఆయా స్టార్స్‌లో ఎవరో ఒకరి పేరు చెప్పాలి. అలాంటిది నయా ట్రెండ్ హీరో విజయ్ దేవరకొండను ఆమె ఇష్టపడడం విశేషం. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేశ్, అల్లు అర్జున్ వంటి హీరోల సరసన నటించినప్పటికీ... అర్జున్ రెడ్డి అంటే ఇష్టమని చెప్పింది. 
 
అలాగే, బాలీవుడ్‌లో ఆమెకు రణ్‌బీర్ సింగ్ అంటే ఇష్టమట. ప్రస్తుతం రకుల్‌ప్రీత్ సింగ్ తమిళంలో విశ్వనటుడు కమల్ హాసన్‌తో 'భారతీయుడు 2' చిత్రంలో నటిస్తోంది. ఇదే ఇప్పుడు రకుల్ చేతిలో ఉన్న క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్. తన ఫేట్‌ని మార్చాల్సిన సినిమా కూడా ఇదే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ప్రధాన హీరోయిన్‌ కాగా, రకుల్ రెండో హీరోయిన్‌గా నటిస్తోంది. హీరో సిద్దార్థ్ మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు.