శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 1 ఆగస్టు 2019 (15:07 IST)

బిగ్‌బాస్ హౌస్‌కు రకుల్ ప్రీత్ సింగ్... ఎందుకంటే...

ప్రముఖ టీవీ చానెల్‌లో ప్రసారమవుతున్న రియాల్టీ షో "బిగ్‌బాస్-3". టావీవుడ్ సీనియర్ నేత అక్కినేని నాగార్జున ప్రధాన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ రియాల్టీ షో గత నెలలో ప్రారంభమైన విజయవంతంగా ప్రసారమవుతోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ 'బిగ్‌బాస్ హౌస్‌'లోకి అడుగుపెట్టనుంది. అయితే కంటెస్టెంట్‌గా మాత్రం కాదండోయ్... ఓ చిత్రం ప్రమోషన కార్యక్రమంలో భాగంగా ఆమె ఈ హౌస్‌లోకి అడుగుపెట్టనుంది. 
 
అక్కినేని నాగార్జున - రకుల్ ప్రీత్ జంటగా నటించిన తాజా చిత్రం "మన్మథుడు-2". గతంలో వచ్చిన 'మన్మథుడు'కు ఈ చిత్రం సీక్వెల్. ఈ చిత్రం ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
ఈ నేపథ్యంలో చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇందులోభాగంగా, బిగ్ బాస్‌ హౌస్‌లోకి రకుల్ ప్రీత్ సింగ్ ఎంట్రీ ఇచ్చి సందడి చేయనున్నట్టు సమాచారం. ఆమెతో పాటు.. చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కూడా ప్రవేశించనున్నారు.