రామబాణం.. ఆ పాటను వాడుకున్నారు.. 3 రోజులే టైమ్
రామబాణం సినిమా వివాదంలో చిక్కుకుంది. జానపద గాయకుడు గొల్లపల్లి రవీందర్ ఈ సినిమాలోని పాటపై ఆరోపణలు చేశారు. ఐఫోన్ సినిమా పాటలో తాను సిద్ధం చేసిన లైన్లు, ట్యూన్స్ గోపీచంద్ రామబాణం సినిమాలో వాడుకున్నారని.. ఈ పాటకు క్రెడిట్ తనకివ్వాలని.. ఈ పాటను ఎందుకు వాడుకున్నారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రామబాణం యూనిట్ తనకు ఎలాంటి క్రెడిట్ ఇవ్వకుండా తన పాటను ఉపయోగించుకుందని గాయకుడు ఆరోపించారు. దీనిపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని అల్టిమేటం ఇచ్చారు. అలా జరగని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.