గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (12:10 IST)

శ్రీరామనవమి: రామాయణంలో సాయిపల్లవి పేరు ఏంటో తెలుసా?

Sai Pallavi
Sai Pallavi
దంగల్ ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణంలో సీత పాత్ర పోషించే నటిగా స్టార్ హీరోయిన్ సాయి పల్లవి పేరును శ్రీరామనవమి సందర్భంగా ప్రకటిస్తారని సర్వత్రా వార్తలు వస్తున్నాయి. 
 
ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, రావణుడిగా కేజీఎఫ్ ఫేమ్ యష్ నటించనున్నారు. కేజీఎఫ్‌లో యష్ ప్రతినాయకుడి పాత్రలో పోషించడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేజీఎఫ్‌తో మాస్ హీరో ముద్ర వేసుకున్న యష్.. రావణుడి పాత్రలో కనిపించనుండటంపై ఆయన ఫ్యాన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.  
 
గతంలో 'ఆదిపురుష్' కోసం కృతి సనన్ సీతగా మారింది. అయితే ఈ రామాయణంలో ఆమెను తీసుకోలేదు. అలాగే కంగనా పేరు కూడా వినిపించింది. కానీ ఆమె కూడా ఈ సినిమా సీన్లోకి రాలేదు. కానీ సాయిపల్లవి దర్శకుడు సీతమ్మ రోల్ కోసం తీసుకున్నాడు. మరి ప్రేమమ్‌లో మలర్ టీచర్‌గా మెప్పించిన ఫిదా బామ్మ.. సీతమ్మగా ఎలా కనిపిస్తుందో వేచి చూడాలి.